ఐఎస్‌‌‌‌ఎల్‌‌‌‌ను మేమే నిర్వహిస్తాం..ఆలిండియా ఫుట్‌‌‌‌బాల్ ఫెడరేషన్ ప్రకటన

ఐఎస్‌‌‌‌ఎల్‌‌‌‌ను మేమే నిర్వహిస్తాం..ఆలిండియా ఫుట్‌‌‌‌బాల్ ఫెడరేషన్ ప్రకటన

న్యూఢిల్లీ: ఇండియా సాకర్ ప్లేయర్లకు గుడ్‌‌‌‌న్యూస్‌‌‌‌. ఆలిండియా ఫుట్‌‌‌‌బాల్ ఫెడరేషన్ (ఏఐఎఫ్‌‌‌‌ఎఫ్‌‌‌‌) ఎట్టకేలకు ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌‌‌‌ఎల్‌‌‌‌) 2025–-26 సీజన్‌‌‌‌ నిర్వహణపై క్లారిటీ ఇచ్చింది. వాణిజ్య భాగస్వాములు లేకపోవడంతో గత సెప్టెంబర్ నుంచి వాయిదాపడుతూ వస్తున్న ఈ లీగ్‌‌‌‌ను తామే నిర్వహిస్తామని ఏఐఎఫ్‌‌‌‌ఎఫ్‌‌‌‌ శనివారం ప్రకటించింది. 

ఈ మేరకు ఏర్పాటైన ఏఐఎఫ్​ఎఫ్​–ఐఎస్‌‌‌‌ఎల్ సమన్వయ కమిటీ రూపొందించిన నివేదికను తమ ఫెడరేషన్ అత్యవసర కమిటీ ఆమోదించిందని తెలిపింది. వచ్చే వారం లీగ్ ప్రారంభ తేదీలను వెల్లడిస్తామని పేర్కొంది. మరోవైపు, దేశ ఫుట్‌‌‌‌బాల్‌‌‌‌లో నెలకొన్న అనిశ్చితిపై సునీల్ ఛెత్రీ, సందేష్ జింగన్ వంటి స్టార్ ప్లేయర్లు ‘సేవ్ ఇండియన్  ఫుట్‌‌‌‌బాల్‌‌‌‌’ అంటూ ఆందోళన వ్యక్తం చేశారు.