ఇజ్రాయెల్‌‌ ప్రధాని రేసులో మళ్లీ నెతన్యాహు

ఇజ్రాయెల్‌‌ ప్రధాని రేసులో మళ్లీ నెతన్యాహు

ఇయ్యాల ఎన్నికలు, రేపు రిజల్ట్‌‌

జెరుసలేం: ఇజ్రాయెల్‌‌లో ప్రధాన రాజకీయ పార్టీలన్నీ మళ్లీ ఎలక్షన్స్‌‌కు సిద్ధమయ్యాయి. ప్రస్తుత ప్రధాన మంత్రి యార్‌‌‌‌ లాపిడ్‌‌ ఆధ్వర్యంలోని సంకీర్ణ ప్రభుత్వం కూలిపోవడంతో ఎన్నికలు జరగనున్నాయి. దీంతో మంగళవారం ఎన్నికలు నిర్వహించనుండగా, బుధవారం ఫలితాలు వెలువడనున్నాయి. ఈ ఎన్నికల్లో మాజీ ప్రధాన మంత్రి బెంజమిన్‌‌ నెతన్యాహు కూడా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. దేశ ప్రధానిగా ఎక్కువ కాలం పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. అక్కడ ఏ పార్టీకి పూర్తి మెజారిటీ రాకపోవడంతో ప్రస్తుతం సంకీర్ణ ప్రభుత్వం కొనసాగుతోంది.

దీంతో ఆ దేశంలో నాలుగేండ్లలోనే ఇది ఐదో ఎన్నిక కావడం గమనార్హం. 120 సీట్లకు గాను ఏ పార్టీకి మ్యాజిక్‌‌ ఫిగర్‌‌‌‌ 61 సీట్లు రావడం లేదు. 2009 తర్వాత నెతన్యాహు ప్రధానిగా కాకుండా ఎన్నికల్లో పోటీ చేయడం ఇదే తొలిసారి. ఈసారి నెతన్యాహు పార్టీ దాని మిత్రపక్షాలు మ్యాజిక్‌‌ ఫిగర్‌‌‌‌కు దగ్గరగా వస్తాయని పలువురు భావిస్తున్నారు. మంగళవారం జరిగే ఎన్నికల ఫలితాలు బుధవారం వెలువడే అవకాశం ఉంది. ప్రస్తుత ప్రధాన మంత్రి యార్‌‌‌‌ లాపిడ్‌‌, ఆయన మిత్రపక్ష పార్టీలు రెండో స్థానంలో 
వస్తాయని అంటున్నారు.