
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్(Vijay)ను అరెస్ట్ చేయాలంటూ చెన్నై డీజీపీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు ఆల్ పీపుల్స్(All peoples) పొలిటికల్ పార్టీ నాయకురాలు రాజేశ్వరి ప్రియ(Rajeshwari priya). విజయ్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా తనను బెదిరిస్తున్నారని ఫిర్యాదులో తెలిపారు.
ఇటీవల విజయ్ హీరోగా చేసిన లియో(Leo) సినిమా నుండి "నా రెడీ(Naa ready)" అనే పాట విడుదలైన సంగతి తెలిసిందే. ఈ పాటలో విజయ్.. సిగరెట్ తాగుతూ కనిపించడంపై పెద్దఎత్తున వివాదం జరిగింది. అంతేకాదు పలువురు కోర్టుకు కూడా వెళ్లారు. వారిలో ఆల్ పీపుల్స్ పొలిటికల్ పార్టీ నాయకురాలు రాజేశ్వరి ప్రియ ఒకరు. ఆమె ఇప్పుడు మరోసారి విజయ్ ని టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేశారు.
ఇందులో భాగంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. "విజయ్ సినిమాలోని పాటపై మేము నిరసనలు వ్యక్తం చేసినందుకే.. పొగాకు క్యాన్సర్ కు కారణం అనే వ్వార్నిగ్ ను పాటలో యాడ్ చేశారు చిత్ర యూనిట్. ఈ కారణంగా విజయ్ అభిమానులు సోషల్ మీడియాలో నాపై అసభ్యకరంగా మాట్లాడుతూ, బెదిరిస్తున్నారు. విజయ్ సోషల్ మీడియా ఐడీని ట్యాగ్ చేస్తూ దారుణంగా కామెంట్లు పెడుతున్నారు. హీరో విజయ్ కూడా నన్ను బెదిరించారు. ఓ మహిళను ఇబ్బంది పెట్టేలా అభిమానులను ప్రేరేపించిన హీరో విజయ్ ని పోలీసులు వెంటనే అరెస్టు చేయాలిని" డిమాండ్ చేశారు రాజేశ్వరి ప్రియ. మరి ఈ పిర్యాదుపై విజయ్ తరుపు నుండి ఎలాంటి సమాధానం వస్తుందో చూడాలి.