
ముషీరాబాద్, వెలుగు: ఎస్సీ వర్గీకరణ వల్ల మాలలకు జరుగుతున్న అన్యాయంపై అన్ని రాజకీయ పార్టీలు స్పందించాలని మాల మహానాడు జాతీయ అధ్యక్షులు గోపోజు రమేశ్ బాబు డిమాండ్ చేశారు. ఎస్సీ వర్గీకరణను సవరించి మాలలతో పాటు 26 ఎస్సీ కులాలకు న్యాయం చేయాలని కోరారు. గురువారం సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావునుఆయన కలిసి వినతి పత్రం అందజేశారు. వర్గీకరణ వల్ల మాలలకు జరిగే నష్టాన్ని వివరించారు. అనంతరం మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణ చేయడం వల్ల 26 కులాలకు జరుగుతున్న అన్యాయంపై అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు స్పందించాలని కోరారు.