- రాచకొండ సీపీ సుధీర్‌బాబు
ఎల్బీనగర్, వెలుగు: శాంతిభద్రతలకు ప్రజలు సహకరించాలని, ప్రతిఒక్కరూ యూనిఫాం లేని పోలీసేనని రాచకొండ సీపీ సుధీర్ బాబు అన్నారు. బుధవారం సరూర్ నగర్ స్టేడియంలో 2 వేల మందితో పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలను నిర్వహించారు. ప్రముఖ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ, సుధీర్ సంద్ర, డాక్టర్ కవిత తమ పాటలతో చైతన్యం నింపారు. అనంతరం సీపీ మాట్లాడుతూ.. ప్రజలకు మెరుగైన సేవలందించడంలో రాచకొండ పోలుసులు ముందున్నారన్నారు. కమిషనరేట్ లో నిమిషానికి రెండు డయల్ 100 కాల్స్ అటెంప్ట్ చేస్తున్నామని చెప్పారు. శాంతిభద్రతల పరిరక్షణలో ప్రాణాలు అర్పించిన పోలీసుల త్యాగం మరువలేమన్నారు. కార్యక్రమంలో డీసీపీలు పద్మజా, అనురాధ, ఆకాంక్ష్ యాదవ్, అరవింద్ బాబు, ఇందిరా, ఉషా రాణి, సునీతారెడ్డి, నరసింహారెడ్డి, రమణారెడ్డి, శ్రీనివాసులు, నాగలక్ష్మి, మనోహర్, శ్యామ్ సుందర్, అడిషనల్ డీసీపీలు, ఏసీపీలు పాల్గొన్నారు.
