న్యూఢిల్లీ: ఐపీఎల్–19లో అజేయంగా దూసుకుపోతున్న పంజాబ్ కింగ్స్ ఎలెవన్‌కు మరో గుడ్‌న్యూస్. వెన్ను నొప్పితో కేవలం బ్యాటింగ్‌కే పరిమితమైన ఆల్‌రౌండర్ కూపర్ కనోలి త్వరలోనే బౌలింగ్ చేసే చాన్స్ కూడా ఉంది. ఈ మేరకు బౌలింగ్ ఫిట్‌నెస్ పరీక్షల కోసం కనోలి ఆస్ట్రేలియాకు వెళ్లాడు. అక్కడ అతనికి స్కానింగ్ నిర్వహించనున్నారు.
ఇందులో ఫలితాలు పాజిటివ్‌గా వస్తే బౌలింగ్ చేసేందుకు క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) అనుమతి ఇవ్వనుంది. అయితే శనివారం ఢిల్లీతో జరిగే మ్యాచ్‌కు కనోలి అందుబాటులో ఉంటాడా? లేదా? అన్న దానిపై స్పష్టత లేదు. అయితే వీలైనంత త్వరగా కనోలి జట్టులో చేరతాడని ఫ్రాంచైజీ వర్గాలు వెల్లడించాయి. ఈ సీజన్‌లో ఓపెనర్‌గా బరిలోకి దిగిన కనోలి ఆ తర్వాత మూడో ప్లేస్‌లో అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నాడు. ఇప్పటి వరకు ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో 163.97 స్ట్రయిక్ రేట్‌తో 55.57 సగటుతో 223 రన్స్ చేశాడు.

