వచ్చే ఐపీఎల్లో కేకేఆర్ తరపున ఆడనున్న శార్దూల్ ఠాకూర్

వచ్చే ఐపీఎల్లో కేకేఆర్ తరపున ఆడనున్న శార్దూల్ ఠాకూర్

ఐపీఎల్ 2023 సీజన్లో ఆల్ రౌండర్ శార్దూల్ ఠాకూర్  కోల్కతాకు ఆడనున్నాడు. గత సీజన్లో ఢిల్లీ తరపున ఆడిన శార్దూల్ వచ్చే సీజన్లో కేకేఆర్ తరపున బరిలోకి దిగనున్నాడు.  క్యాష్ డీల్‌తో ఢిల్లీ ఆటగాడైన శార్దూల్ ఠాకూర్‌ను కేకేఆర్ జట్టులోకి తెచ్చుకుంది

.

ట్రేడ్ విండోత రిటెన్షన్..
ఐపీఎల్ 2023 రిటెన్షన్ ప్రక్రియను కోల్‌కతా  ట్రేడ్ విండోతో పూర్తి చేయాలని భావిస్తోంది. ఆ జట్టులోని కీలక ఆటగాళ్లైన సామ్ బిల్లింగ్స్, ప్యాట్ కమిన్స్ వచ్చే సీజన్లో ఆడబోమని ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆ స్థానాలను భర్తీ చేయడంపై  ఫోకస్ పెట్టిన కోల్కతా..గుజరాత్ టైటాన్స్ నుంచి ఫెర్గూసన్, రహ్మనుల్లా గుర్బాజ్‌లను ట్రేడ్ విండో ద్వారా తీసుకుంది. తాజాగా ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్‌ను తెచ్చుకుంది.  2023 సీజన్కు సంబంధించి  రిటెన్షన్ ప్రక్రియకు బీసీసీఐ నవంబర్ 15 డెడ్‌లైన్‌ విధించింది. 

2022లో ఢిల్లీ తరపున...
ఐపీఎల్ 2022 వేలంలో శార్దూల్ ఠాకూర్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ రూ.10.75 కోట్లకు కొనుగోలు చేసింది. ఈ సీజన్ లో 14 మ్యాచులు ఆడిన శార్దూల్ 9.79 ఎకానమితో..15 వికెట్లు తీసుకున్నాడు. 138 స్ట్రైక్ రేట్ తో 120 పరుగులు సాధించాడు.