నేడు (అక్టోబర్ 1న) అన్ని పాఠశాలలు ఓపెన్.. ఉత్తరప్రదేశ్ సర్కార్ కీలక నిర్ణయం

నేడు (అక్టోబర్ 1న) అన్ని పాఠశాలలు ఓపెన్.. ఉత్తరప్రదేశ్ సర్కార్ కీలక నిర్ణయం

ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సూచనల మేరకు ఉత్తరప్రదేశ్‌లోని అన్ని బోర్డు పాఠశాలలు ఈరోజున అంటే అక్టోబర్ 1న తెరిచి ఉంటాయి. అక్టోబరు 2న గాంధీ జయంతి జరుపుకుంటున్న సందర్భంగా అక్కడి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. 'స్వచ్ఛజనలి' కార్యక్రమంలో భాగంగా పాఠశాలల్లో గంటపాటు శ్రమదాన కార్యక్రమం నిర్వహించనున్నారు. దాంతో పాటు అన్ని పాఠశాలలు 'ప్రభాత్ ఫేరిస్'లో పాల్గొంటాయి, ఇందులో విద్యార్థులు, ఉపాధ్యాయులు శ్రమదానం చేస్తారు. కార్యక్రమం అనంతరం విద్యార్థులకు స్వీట్లు అందజేసి అభినందనలు తెలిపుతారు.

154వ గాంధీ జయంతి సందర్భంగా 154 గంటల పాటు స్వచ్ఛత కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. పాఠశాల విద్యార్థులు ప్రభాత్ పేరీలో పాల్గొని సమాజానికి స్వచ్ఛతే సేవ అనే సందేశాన్ని అందించాలని కోరనున్నారు. ప్లాస్టిక్‌, పాలిథిన్‌ నిషేధంపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా పరిశుభ్రమైన, మరింత స్థిరమైన వాతావరణాన్ని ప్రోత్సహించడం దీని లక్ష్యం.

ఉత్తరప్రదేశ్‌లోని అన్ని పాఠశాలలు పరిశుభ్రతపై దృష్టి సారించి 15 నిమిషాల ఉదయం అసెంబ్లీని నిర్వహించాలని తెలుపుతూ రాష్ట్ర మాధ్యమిక విద్యా శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ ఉదయం ప్రతి పాఠశాలలో అసెంబ్లీ  నిర్వహించడం తప్పనిసరి విధిగా ఉండనుంది. పాఠశాల ప్రధానోపాధ్యాయులు సభకు 15 నిమిషాల ముందుగానే రావాలని ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్‌ ఈ సందర్భంగా కోరారు.