24 గంటల షాపింగ్​కి... రెడీ అవుతోన్న హైదరాబాద్​

24 గంటల షాపింగ్​కి... రెడీ అవుతోన్న హైదరాబాద్​

దుకాణాలు, పలు సంస్థలు తమ కార్యకలాపాలను 24 గంటలు నడుపుకునేలా ప్రభుత్వం త్వరలో వెసులు బాటు కల్పించనుంది. హైదరాబాద్​లో 24 గంటలు దుకాణాలు ఓపెనింగ్​ చేసే ప్లాన్​ త్వరలో అమల్లోకి రానుంది. ఏ విభాగం నోడల్​ అథారిటీగా అనుమతులు ఇవ్వాలనే దానిపై నెలకొన్న సందిగ్ధత పరిష్కరమై, ఆ పనిని కార్మిక శాఖకు అప్పగించారు. ఈ శాఖ 24 గంటల అనుమతి కోరే వారికి పర్మిషన్ ఇస్తుంది.  గతంలోనే దీనికి సంబంధించిన జీవో జారీ చేసినప్పటికీ.. కార్మిక శాఖ,పోలీస్​ శాఖల ప్రమేయం ఉన్నందు వల్ల అమలులో ప్రతిష్టంభన ఏర్పడింది. ఇప్పుడు పలు మార్పులు చేసి సవరించిన జీవోని మరి కొన్ని రోజుల్లో జారీ చేయనున్నారని అధికారులు చెబుతున్నారు. 

  • 24 గంటలు నడిచే దుకాణదారుల యజమానులు రూ.10 వేలు చెల్లించి కార్మిక శాఖ నుంచి అనుమతి కోసం దరఖాస్తు చేసుకోవాలి. 
  • ఎక్సైజ్​ యాక్ట్​ కిందకి వచ్చే వైన్స్​24 గంటలు నడిచేందుకు అనుమతి లేదు.
  • వీకెండ్స్ లో ఎక్కువ మంది కస్టమర్లను ఆకర్షించడానికి ఈ నిర్ణయం ఉపయోగపడుతుంది.
  • కార్మిక శాఖ నుంచే అనుమతులు పొందాలి.
  • అనుమతుల కోసం మొదట పోలీసుల పర్మిషన్​ తీసుకోవాల్సిన అవసరం లేదు.
  • అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు తెలిస్తే అనుమతి రద్దు చేస్తారు.