కొత్తగూడెంలోని గవర్నమెంట్​ జనరల్​ హాస్పిటల్​లో అన్ని సమస్యలే

కొత్తగూడెంలోని గవర్నమెంట్​ జనరల్​ హాస్పిటల్​లో అన్ని సమస్యలే

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు:  కొత్తగూడెంలోని గవర్నమెంట్​ జనరల్​ హాస్పిటల్​లో సమస్యలు తాండవిస్తున్నాయి. హాస్పిటల్​లో సౌకర్యాలు, రోగుల కష్టాల గురించి అధికారులు పట్టించుకోవడం లేదు. బ్లడ్​ టెస్ట్​ల కోసం ఆసుపత్రి బయటకు పొమ్మంటున్నారని రోగులు ఆరోపిస్తున్నారు. ఒకే టాయ్​లెట్​లోకి లేడీస్​, జెంట్స్​వెళ్లే దుస్థితి పెద్దాసుపత్రిలో నెలకొంది. మధ్యాహ్నం 12 గంటలు దాటితే ఓపీ చూడటం లేదు.  హాస్పిటల్​ పై కప్పు నుంచి వాటర్​ లీకేజ్​అవుతోంది.  పై కప్పు నుంచి ఊకే పెచ్చులూడి కిందపడుతున్నాయి.  దీంతో జిల్లా ఆసుపత్రిలో  రోగులు మస్తు భయంగా గడపాల్సిన పరిస్థితి ఏర్పడింది. 

బ్లడ్​ టెస్ట్ లైతే బయటకు పోవుడే.. 

కొత్తగూడెంలోని సర్కార్​ జనరల్​ హాస్పిటల్​లోని బ్లడ్​ టెస్ట్​లు చేసే మెషన్​ మూడు రోజులుగా పనిచేస్తలేదు. అయినా ఎవరూ పట్టించుకుంట లేరు. ఎమర్జెన్సీ టైంలో చేసే సీరం ఎలక్ట్రోలైట్స్​ బ్లడ్​టెస్ట్​ మెషిన్​ కూడా పని చేస్తలేదు. హార్ట్​, బ్రెయిన్, పెరాలసిస్​ వంటి ప్రాబ్లమ్స్​తో వచ్చే వారికి సీరం ఎలక్ట్రోలైట్​ టెస్టులు అవసరం ఉంటుంది. సోడియం, పొటాషియం, క్లోరైడ్​ తెలుసుకునే ముఖ్యమైన టెస్ట్​లు మూడు రోజులుగా దవాఖానాలో బంద్​ అయ్యాయి.  దీంతో రోగులు ప్రైవేట్​ ల్యాబ్ లకు వెళ్లాల్సి వస్తోంది.  బ్లడ్​ టెస్ట్​లు చేసే మిషన్​ కనీసం పనిచేయడం లేదనే విషయం ఉన్నతాధికారులకు సమాచారం లేదు.  హాస్పిటల్​లోనే  టీ హబ్​ ఉన్నప్పటికీ బ్లడ్​ టెస్ట్​ల కోసం అక్కడికి పంపించకపోవడం దారుణం.  మరోవైపు ఉదయం 9.30 గంటలకు రోగులకు డాక్టర్లు అందుబాటులో ఉండాలి.  కొంతమంది డాక్టర్లు పది దాటినా రావడం లేదు.  మధ్యాహ్నం 12 నుంచి 12.30 గంటలు దాటితే ఓపీ బంద్​ చేస్తున్నారు.  గ్రౌండ్​ ఫ్లోర్​లోని ఎక్స్​రే ల్యాబ్​ సమీపంలో పై కప్పు నుంచి వాటర్​ లీకేజ్​ అవుతోంది.ఒకే టాయ్​లెట్​లోకి మహిళలు, పురుషులు వెళ్లే దారుణమైన పరిస్థితి ఉంది. మహిళల టాయ్​లెట్స్​ విడిగా ఉన్నా వాటిని ఓపెన్​ చేస్తలేరు. దీంతో మహిళలు ఇబ్బందులు పడుతున్నారు.  డాక్టర్లు సాయంత్రం ఓపీలో ఉండే విధంగా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. 

బయటకు పంపిస్తలె.. 

బ్లడ్​ టెస్ట్​ల కోసం రోగులను బయటకు పంపిస్తలేరు. మూడు రోజలుగా సీరం ఎలక్ట్రోలైట్​ టెస్ట్​లు జరగడం లేదనే విషయం నా దృష్టికి రాలేదు. డాక్టర్లు ఓపీలో ఒక్క పూటే ఉంటారు. అత్యవసరమైతే రోగులు ఎమర్జెన్సీ వార్డుకు వెళ్లి ట్రీట్​మెంట్ తీసుకోవచ్చు. అక్కడ డాక్టర్లు 24 గంటలు అందుబాటులో ఉంటారు.‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌
– కుమారస్వామి, హాస్పిటల్​ మెడికల్​ సూపరింటెండెంట్​, కొత్తగూడెం