ఉద్యమంలో లాఠీ దెబ్బలు తిన్నవాళ్లకి పదవులొచ్చినయ్

ఉద్యమంలో లాఠీ దెబ్బలు తిన్నవాళ్లకి పదవులొచ్చినయ్

దేశంలో కాంగ్రెస్, బీజేపీ పాలిస్తున్న రాష్ట్రాల్లో పింఛన్లు 400 నుండి 500 ఇస్తుంటే తెలంగాణ రాష్ట్రంలో రూ. 2వేలను పింఛన్ గా ఇస్తున్నామన్నారు మంత్రి హరీశ్ రావు. నర్సాపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటి చైర్మన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యారు మంత్రి హరీశ్ .ఈ సందర్భంగా మాట్లాడియన ఆయన.. గత ప్రభుత్వాల పాలనలో మంజీర నదిపై ఒక్క చెక్ డ్యామ్ కాలేదని..TRS ప్రభుత్వం 110 కోట్లతో 15 చెక్ డ్యామ్ లు నిర్మించామని తెలిపారు. అందులో 14 చెక్ డ్యామ్ లు నర్సాపూర్ కు ఉపయోగపడతాయన్నారు. జార్ఖండ్, బీహార్ రాష్ట్రాల్లోని మక్కలను ఇక్కడకు తెచ్చి అమ్ముతున్నారని తెలిపారు. దీంతో ఇక్కడి రైతులు నష్టపోతున్నారన్నారు.తెలంగాణ ఉద్యమంలో లాఠీ దెబ్బలు తిన్నవారికి పదవులు దక్కడం సంతోషంగా ఉందన్నారు మంత్రి హరీశ్ రావు. అంతేకాదు..దేశంలో ఎక్కడలేని విధంగా 24 గంటల కరెంటు సరఫరా ఉన్న రాష్ట్రం తెలంగాణ అన్నారు.