
భారత వివాహ వ్యవస్థను సహజీవనం పేరుతో యువత ధ్వంసం చేస్తోందని అలహాబాద్ హైకోర్టు మండిపడింది. అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న సహజీవన భాగస్వామికి బెయిల్ మంజూరు చేస్తూ ఈ వ్యాఖ్యలు చేసింది. సామాజిక భద్రత, అంగీకారం, స్థిరత్వం వంటివి వివాహ వ్యవస్థ మాత్రమే అందించగలదని..సహజీవనం దానిని ఎన్నటికీ భర్తీ చేయలేదని కోర్టు తెలిపింది. ఇలాంటి ధోరణికి యువత ఆకర్షితులవడంపై కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది.
ప్రతి సీజన్‌లో భాగస్వాములను మార్చడం అనే క్రూరమైన చర్య సమాజానికి మంచిది కాదని అభిప్రాయపడింది.భవిష్యత్తులో ఇలాంటి వాటి వల్ల ఏర్పడే పరిణామాలపై వారికి అవగాహన లేకపోవడమే ఇందుకు కారణమని తెలిపింది. యూపీకి చెందిన 19 ఏళ్ల బాలిక సహజీవనం చేసిన వ్యక్తిని రేప్ కేసు పెట్టింది. ఈ కేసులో అతనికి కోర్టు బెయిలిచ్చింది.