కనకదుర్గ టైటిల్ తో అల్లరి నరేష్ కొత్త సినిమా

కనకదుర్గ టైటిల్ తో అల్లరి నరేష్ కొత్త సినిమా

అల్లరి నరేష్  హీరోగా ప్రదీప్ మద్దాలి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోంది.  డివోషనల్ బ్యాక్‌‌‌‌డ్రాప్‌‌‌‌లో తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి  ‘కనకదుర్గ’ అనే  టైటిల్‌‌‌‌ను రివీల్ చేశారు.   స‌‌‌‌మీర్ నాయ‌‌‌‌ర్‌‌‌‌, దీపక్ సెహ‌‌‌‌గ‌‌‌‌ల్‌‌‌‌, అజిత్ ఠాకూర్‌‌‌‌, బీవీఎస్ రవి  నిర్మిస్తున్నారు. కాజ‌‌‌‌ల్ చౌద‌‌‌‌రి హీరోయిన్‌‌‌‌.  ఇటీవల పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు.  ముహూర్తపు షాట్‌‌‌‌కు నిర్మాత అల్లు అరవింద్ క్లాప్ కొట్టగా,  సురేఖ కొణిదెల కెమెరా స్విచాన్ చేశారు. స్వప్నాదత్ గౌరవ దర్శకత్వం వహించారు. 

 శ్యామ్ ప్రసాద్ రెడ్డి, హ‌‌‌‌రీష్ శంక‌‌‌‌ర్‌‌‌‌, మిక్కిలినేని సుధాక‌‌‌‌ర్‌‌‌‌, కోన వెంక‌‌‌‌ట్‌‌‌‌, ప్రశాంత్ వ‌‌‌‌ర్మ, మ‌‌‌‌ధుర శ్రీధ‌‌‌‌ర్‌‌‌‌ తదితరులు అతిథులుగా హాజరై టీమ్‌‌‌‌కు బెస్ట్ విషెస్ చెప్పారు. ఈ సందర్భంగా దర్శకుడు ప్రదీప్ మద్దాలి మాట్లాడుతూ ‘ఈ సినిమా అసలు కథ భక్తి గురించి మాత్రమే కాదు.. జీవితంలో ఛిద్రమైన ఒక మనిషి, తనకంటే గొప్పదైన శక్తిని ఎదుర్కొన్నప్పుడు ఏమి జరుగుతుందో చెప్పే కథే ఇది’ అని అన్నాడు. అమ్మవారి అనుగ్రహంతో ఈ ప్రయాణం సాగుతోందని నిర్మాత బీవీఎస్ రవి అన్నారు.