ఇష్టారాజ్యంగా రైల్వే టీటీ డ్యూటీలు

ఇష్టారాజ్యంగా రైల్వే  టీటీ డ్యూటీలు
  • ఫైన్‌‌ తీసుకుంటరు.. రసీదు ఇవ్వరు!
  • ఇష్టారాజ్యంగా రైల్వే  టీటీ డ్యూటీలు
  • వసూళ్లపై ఉన్నతాధికారులు ఫిర్యాదులు


నిజామాబాద్ టౌన్, వెలుగు: నిజామాబాద్ -  సికింద్రాబాద్ - కాచిగూడ వైపు వెళ్తున్న రైళ్లలో కొంతమంది టీటీలు దండిగా దోచుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. జనరల్‌‌ టికెట్‌‌ తీసుకుని రిజర్వేషన్ బోగిల్లో ఎక్కే ప్యాసింజర్లకు రూ.100 నుంచి రూ.300 వరకు ఫైన్స్‌‌ వేస్తున్నా వారికి రశీదు ఇవ్వడంలేదని తెలుస్తోంది. సికింద్రాబాద్ నుంచి నిజామాబాద్ వైపు వచ్చే రైళ్లలో వచ్చే టీటీలు అందినకాడికి జేబులో వేసుకుని ఇందూరు స్టేషన్ రాగానే బోగీల్లోంచి జారుకుంటున్నట్లు సమాచారం. వాస్తవానికి జనరల్ టికెట్ తీసుకుని అనుకోని పరిస్థితిలో రిజర్వేషన్‌‌ బోగీలో ఎక్కే ప్రయాణికుల వద్ద నుంచి రైల్వే యాక్ట్ ప్రకారం ఫైన్లు రాసి రసీదు ఇవ్వాలి. అలా చేయకుండా కొందరు టీటీలు అందినకాడికి దండుకుని రైల్వే శాఖకు నష్టాన్ని తెచ్చిపెడుతున్నారు. ప్రయాణికులు కూడా తమ పరిస్థితిని ఎవరికి చెప్పుకోవాలో తెలియక గమ్మున ఉండిపోతున్నారు. అయితే ఇటీవల డబ్బులు తీసుకుని రసీదు ఇవ్వని ఓ టీటీపై నిజామాబాద్ రైల్వే స్టేషన్‌‌లో అధికారులకు ఫిర్యాదు ఇవ్వడానికి వెళ్లిన ప్రయాణికులపై సదరు టీటీ అసభ్య పదజాలంతో దూషించినట్లు తెలిసింది.