రెండు రోజులుగా మెస్ బంద్... ఓయూ విద్యార్థుల ఆందోళన

రెండు రోజులుగా మెస్ బంద్... ఓయూ విద్యార్థుల ఆందోళన

హైదరాబాద్:   ఉస్మానియా యూనివర్సిటీలోని ‘ఈ2’ హాస్టల్ లో రెండు రోజులుగా మెస్ బంద్ చేశారని ఆరోపిస్తూ ఓయూ  విద్యార్థులు ఆర్ట్స్ కళాశాల రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు. వీసీ, హాస్టల్ వార్డెన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేర్ టేకర్ పై చర్యలు తీసుకోవాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ... ఓయూ హాస్టళ్లలో తరచుగా మెస్ లు బంద్ అవుతున్నాయని ఆరోపించారు. మెస్ లో నాణ్యమైన భోజనం అందించడంలేదని, వాటర్ ఫిల్టర్లు పెట్టడంలేదని వాపోయారు.

కేర్ టేకర్ పై చర్యలు తీసుకోవాలని కోరినా... పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పైగా కేర్ టేకర్ ను ప్రశ్నించినందుకు విద్యార్థులపై ఓయూ పీఎస్ లో కేసు నమోదు చేశారని మండిపడ్డారు. తమకు స్పష్టమైన హామీ వచ్చే వరకు తమ నిరసనను విరమించేదిలేదని తేల్చి చెప్పారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి మెస్ ను  పునరుద్ధరించాలని, కేర్ టేకర్ ను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు.