బొగ్గు బ్లాక్‌‌‌‌లను సింగరేణికే కేటాయించాలని ధర్నా

బొగ్గు బ్లాక్‌‌‌‌లను సింగరేణికే కేటాయించాలని ధర్నా

 కోల్‌‌‌‌బెల్ట్‌‌‌‌, వెలుగు : తెలంగాణ ప్రాంతంలోని అన్ని బొగ్గు బ్లాక్‌‌‌‌లను సింగరేణి సంస్థకే కేటాయించాలని ఏఐటీయూసీ కేంద్ర కమిటీ సెక్రటరీ ఎండీ. అక్బర్‌‌‌‌ అలీ, బ్రాంచ్‌‌‌‌ సెక్రటరీ సలేంద్ర సత్యనారాయణ డిమాండ్‌‌‌‌ చేశారు. మందమర్రి ఏరియా సింగరేణి జీఎం ఆఫీస్‌‌‌‌ ఎదుట ఏఐటీయూసీ ఆధ్వర్యంలో శుక్రవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ప్రధాని మోదీ మొండిగా వ్యవహరిస్తూ సింగరేణి బొగ్గు గనులను వేలం ద్వారా ప్రైవేట్‌‌‌‌ వ్యక్తులకు కేటాయించేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. 

ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్న సింగరేణి సంస్థ మనుగడలో ఉండాలంటే కొత్త బొగ్గు గనులను కేటాయించాలని డిమాండ్‌‌‌‌ చేశారు. గనుల వేలాన్ని రద్దు చేసి, సింగరేణి సంస్థకు నేరుగా బ్లాక్‌‌‌‌లను కేటాయించాలని కోరారు. అంతకుముందు ఈ నెల 8 నుంచి చేపట్టిన రిలే దీక్షలను విరమించారు. అనంతరం మందమర్రి ఏరియా జీఎం మనోహర్‌‌‌‌కు వినతిపత్రం అందజేశారు.