
డిగ్రీ ఫస్ట్ ఫేజ్‌లో 1.41 లక్షల మందికి సీట్లు
కామర్స్‌లో 37.73%, లైఫ్ సైన్సెస్‌లో 20.8% మందికి..
ఖాళీగా 2.66 లక్షల డిగ్రీ సీట్లు
సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్లు స్టార్ట్
హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్లో వివరాలు వెల్లడి
హైదరాబాద్, వెలుగు: డిగ్రీ ఆన్‌లైన్ అడ్మిషన్ల (దోస్త్)లో భాగంగా ఫస్ట్‌ఫేజ్ సీట్లు కేటాయించారు. మొత్తం 1,41,340 మంది స్టూడెంట్లకు సీట్లు అలాట్ చేశారు. వీరిలో అమ్మాయిలు 76,173 మంది, అబ్బాయిలు 65,167 మంది ఉన్నారు. సోమవారం ఉన్నత విద్యామండలి ఆఫీస్‌లో దోస్త్–2020 రిజల్ట్స్, సీట్ల కేటాయింపు వివరాలను కాలేజీ విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్, దోస్త్ కన్వీనర్ ప్రొఫెసర్ లింబాద్రిలతో కలిసి హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్చైర్మన్ తుమ్మల పాపిరెడ్డి రిలీజ్ చేశారు. దోస్త్ ఫస్ట్‌ఫేజ్‌లో మొత్తం 1,71,275 మంది రిజిస్టర్ చేసుకోగా, వారిలో 1,52,326 మంది వెబ్ ఆప్షన్స్ ఇచ్చారు. ఆప్షన్స్ ఇచ్చిన 92.18శాతం మందికి సీట్లు అలాట్ చేశారు. తక్కువ ఆప్షన్లు ఎంచుకున్న 11,983 మందికి సీట్లు కేటాయించలేదు. కాగా వెబ్ ఆప్షన్స్‌లో ఫస్ట్ ప్రయార్టీ ఇచ్చిన కాలేజీల్లో సీట్లు పొందిన స్టూడెంట్లు 1,08,289 ఉండగా, సెకండ్ ప్రయార్టీ ద్వారా సీట్లు పొందిన విద్యార్థులు 32,769 మంది ఉన్నారు. కొత్తగా తీసుకొచ్చిన బీఎస్సీ డేటా సైన్స్ కోర్సులో 6780 సీట్లకు గానూ 2,598 మందికి సీట్లు కేటాయించారు. సీట్లు పొందిన వారు దోస్త్ లాగిన్‌లో ఫీజు చెల్లించి, ఈనెల 26 లోగా ఆన్లైన్సెల్ఫ్ రిపోర్టింగ్ ద్వారా సీటు రిజర్వ్చేసుకోవాలని దోస్త్ కన్వీనర్ లింబాద్రి తెలిపారు. సర్కారు కాలేజీల్లో సీట్లు పొందిన స్టూడెంట్స్ స్కాలర్షిప్కు అర్హత ఉంటే, ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదన్నారు.
ఫస్ట్ ఫేజ్‌లో 982 కాలేజీలు
దోస్త్ ఫస్ట్ ఫేజ్ అడ్మిషన్లకు రాష్ట్రంలో 982 కాలేజీలు అందుబాటులో ఉన్నాయి. గతేడాదితో పోలిస్తే ఆరు కాలేజీలు తగ్గాయి. సెకండ్ ఫేజ్‌లో కొన్ని కాలేజీలు చేరే అవకాశముంది. కాలేజీల్లో గతేడాది 174 కోర్సులుండగా, ప్రస్తుతం 501కి చేరాయి. ఛాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్ (సీబీసీఎస్) విధానంతో భారీగా కోర్సులు పెరిగాయి. 4,07,390 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఫస్ట్ ఫేజ్ సీట్ల కేటాయింపు తర్వాత 2,66,050 సీట్లు అందుబాటులో ఉన్నాయి.
26 వరకు సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్లు
సోమవారం నుంచి 25 వరకు సెకండ్ ఫేజ్ రిజిస్ట్రేషన్లు ఉంటాయి. ఈనెల 21 నుంచి 26 వరకు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు. అక్టోబర్ 1న సీట్లు కేటాయిస్తారు. సెకండ్ ఫేజ్‌లో స్పెషల్ కేటగిరి స్టూడెంట్లకు 25న సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేయనున్నారు. థర్డ్ ఫేజ్ రిజిస్ట్రేషన్లు అక్టోబర్ 1 నుంచి ఐదు వరకు ఉండగా, వెబ్ ఆప్షన్ల ప్రాసెస్ అక్టోబర్ 1 నుంచి ఆరు వరకు ఉంటుంది. సీట్ల కేటాయింపు 10న ఉంటుంది.
టాపర్స్ వీరే…
దోస్త్ టాపర్‌గా నిలిచిన జి.వైష్ణవి కోఠి ఉమెన్స్ కాలేజీలో బీఎస్సీ (ఫిజికల్ సైన్స్)లో, సెకండ్ టాపర్ కేతవత్ అనిల్‌కు నిజాం కాలేజీలో బీఎస్సీ (ఫిజికల్ సైన్స్)లో సీట్లు లభించాయి. థర్డ్ ర్యాంకర్ మనోజ్ఞ బీఏలో నిజాంకాలేజీలో సీటు పొందారు.
For More News..