రక్షణ శాఖకు రూ.5.94లక్షల కోట్ల కేటాయింపు

రక్షణ శాఖకు రూ.5.94లక్షల కోట్ల కేటాయింపు
  • పోయిన ఏడాదితో పోలిస్తే 13% ఎక్కువ
  • కొత్త వెపన్స్, వార్ ​షిప్స్ కొనుగోళ్లు

న్యూఢిల్లీ: బడ్జెట్​లో రక్షణ శాఖకు కేంద్రం భారీగా నిధులు కేటాయించింది. పొరుగు దేశాలతో పొంచి ఉన్న ముప్పును దృష్టిలో పెట్టుకుని రక్షణ రంగానికి బూస్ట్ ఇచ్చింది. 2023–24 బడ్జెట్​లో రూ.5.94 లక్షల కోట్లు కేటాయిస్తున్నట్టు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​ ప్రకటించారు. నిరుడు రూ.5.25 లక్షల కోట్లు ఇచ్చారు. గతంతో పోల్చుకుంటే ప్రస్తుతం కేటాయించిన నిధులు13.31 శాతం అధికంగా ఉన్నాయి. కొత్త వెపన్స్, ఎయిర్​క్రాఫ్ట్స్, వార్​షిప్స్ తో పాటు మిలటరీ హార్డ్​వేర్ కొనేందుకు రూ.1.62 లక్షల కోట్ల క్యాపిటల్ కేటాయించింది. ఆత్మనిర్భర్ భారత్, మేక్ ఇన్ ఇండియాలో భాగంగా దేశీయంగా తయారు చేసిన రక్షణ రంగ ఉత్పత్తులకే ప్రాధాన్యత ఇవ్వనున్నారు. విదేశాల నుంచి దిగుమతులు తగ్గించుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. రక్షణ రంగాన్ని మరింత పటిష్టం చేయనుంది. అగ్నివీర్ కార్పస్ ఫండ్ నుంచి ‘‘అగ్నివీర్స్” అందుకున్న డబ్బులపై పన్ను మినహాయింపు ఇవ్వాలనే ప్రతిపాదన పెట్టింది.

మొత్తం బడ్జెట్​లో 13 శాతం రక్షణ రంగానికే..

రూ.2,70,120 కోట్లను ఆదాయ వ్యయం కోసం కేటాయించారు. ఇందులో నుంచే డిఫెన్స్ ఖర్చులు, శాలరీలు, ఇతరత్ర వాటికి అందజేస్తారు. రక్షణ మంత్రిత్వ శాఖ (సివిల్) కోసం రూ.8,774 కోట్ల క్యాపిటల్​ ఔట్ లేన్​ కేటాయించారు. రూ.1,38,205 కోట్లను డిఫెన్స్ పెన్షన్స్​ కోసం సెపరేట్​గా అందజేయనున్నారు. మొత్తం బడ్జెట్ లో 13% వాటా రక్షణ రంగానికే ఉంది. డిఫెన్స్​ రంగంలో పెన్షన్స్ ఔట్​లేతో పాటు మొత్తం ఖర్చు కలుపుకుని రూ.4,22,162 కోట్లుగా ఉంది. మొత్తం బడ్జెట్ సైజ్ రూ.5,93,537.64 కోట్లుగా ఆర్థిక శాఖ నిర్ణయించింది. 2022–23 ఆర్థిక సంవత్సరంలో రూ.1.52 లక్షల కోట్లు క్యాపిటల్​ ఔట్​లే కేటాయించగా.. అంచనా వ్యయం రూ.1.50లక్షల కోట్లుగా ఉంది. రూ.2,39,000 కోట్లను రెవెన్యూ ఎక్స్​పెండిచర్​గా కేటాయించారు.

రూ.3,545 కోట్లతో బార్డర్స్ లో రోడ్లు, బ్రిడ్జీలు

హోంశాఖకు కేటాయించిన మొత్తంలో రూ.3,545 కోట్లతో బార్డర్స్​ వద్ద రోడ్లు, బ్రిడ్జిలు వంటి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయనున్నారు. పోలీస్​ ఇన్​ఫ్రాస్ట్రక్చర్​ కోసం రూ.2,188 కోట్లు, పోలీస్​ ర్స్​ల మోడ్రనైజేషన్​ కోసం రూ.3,750  కోట్లు ఖర్చు చేయనున్నారు. సెక్యురిటీ రిలేటెడ్​ ఎక్స్ పెండిచర్​ కోసం రూ.2,78‌‌0 కోట్లు కేటాయించారు. జనాభా లెక్కలకు సంబంధించిన వర్క్​ కోసం రూ.1,564.65 కోట్లు, మహిళా  భద్రత కోసం రూ.1,100 కోట్లు, ఫోరెన్సిక్​ కెపాసిటీ పెంచుకునేందుకు రూ.700 కోట్లు, బార్డర్​ చెక్​పోస్టుల మెయింటెనెన్స్​ కోసం రూ.350కోట్లు, సెంట్రల్​ ఫోర్సెస్​ మోడ్రనైజేషన్​ ప్లాన్​ 4 కోసం రూ.202 కోట్లు అలాట్​ చేశారు.

హోంశాఖకు రూ.1.96లక్షల కోట్లు

దేశ ఇంటర్నల్​ సెక్యురిటీకి బడ్జెట్​లో మోడీ ప్రభుత్వం ఎక్కువ ప్రయారిటీ ఇచ్చింది. హోం మంత్రిత్వ శాఖకు రూ.1,96,034.94 కోట్లు కేటాయించింది. ఇందులో ఎక్కువ భాగంగా సెంట్రల్ ఆర్మ్​డ్ పోలీస్​ ఫోర్సెస్​ (సీఆర్​పీఎఫ్), ఇంటెలిజెన్స్​ వర్గాలకు అలాట్ చేసింది. సెంట్రల్ ఆర్మ్​డ్ పోలీస్ ఫోర్సెస్​ (సీఏపీఎఫ్)కు మొత్తంగా రూ.1,27,756.74 కోట్లు కేటాయించారు. నిరుడు రూ.1,19,070.36 కోట్లు కేటాయించారు. ఇండియా ఇంటర్నల్ సెక్యురిటీ బాధ్యత ఎక్కువ సీఏపీఎఫ్​లో  సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్​ (సీఆర్​పీఎఫ్)కే ఉంటుంది. జమ్మూ, కాశ్మీర్​లో టెర్రరిస్టులతో ఫైట్ చేసేది కూడా వీరే. రూ.1.27 లక్షల కోట్లలో అత్యధికంగా రూ.31,772 కోట్లు సీఆర్​పీఎఫ్​కే ఇస్తున్నారు. నిరుడు రూ.31,495.88 కోట్లు కేటాయించారు. 

బీఎస్​ఎఫ్​కు రూ.24వేల కోట్లు

పాకిస్తాన్, బంగ్లాదేశ్ బార్డర్​లో డ్యూటీ చేసే బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్​ఎఫ్)కు రూ.24,771 కోట్లు అలాట్ చేశారు. నిరుడు రూ.23వేల కోట్లు ఇచ్చారు. సీఐఎస్​ఎఫ్​కు రూ.13,214 కోట్లు, శసస్త్ర సీమ బల్ (ఎస్ఎస్​బీ)కి రూ.8,329 కోట్లు, ఇండో టిబెటన్​ బార్డర్​ పోలీస్​ (ఐటీబీపీ)కి రూ.8,096 కోట్లు, ఇండియా-మయన్మార్​ బార్డర్, నార్త్​ఈస్ట్​లో డ్యూటీ చేసే అస్సాం రైఫిల్స్​కి రూ.7,052 కోట్లు కేటాయించారు. ఎన్​ఎస్​జీ కమాండోలకు రూ.1,286 కోట్లు, ఇంటెలిజెన్స్​ బ్యూరోకి రూ.3,418 కోట్లు, స్పెషల్​ ప్రొటెక్షన్​ గ్రూప్​ (ఎస్​పీజీ)కి రూ.433 కోట్లు, ఢిల్లీ పోలీసులకు రూ.11,662 కోట్లు అలాట్ చేశారు.