చరిత్ర సృష్టించిన Nvidia: ఇండియా GDP ని దాటిన కంపెనీ మార్కెట్‌క్యాప్

చరిత్ర సృష్టించిన Nvidia: ఇండియా GDP ని దాటిన కంపెనీ మార్కెట్‌క్యాప్

Nvidia చరిత్ర సృష్టించింది. కృత్రిమ మేధస్సు (AI) రంగంలో తన అద్భుతమైన వృద్ధిని సాధించింది. జూలై 9, 2025 బుధవారం 4 ట్రిలియన్ల డాలర్ల మార్కెట్ విలువను చేరుకున్న మొట్టమొదటి కంపెనీగా అవతరించింది. ఇది భారతGDP కంటే అధికం. ప్రపంచ ఆర్థిక మార్కెట్‌లో దాని ఆధిపత్యాన్ని మరింత పటిష్టం చేసుకుంది. 

AI డ్రైవెన్ గ్రోత్: Nvidia మార్కెట్ విలువలో ఈ అనూహ్య వృద్ధికి ప్రధాన కారణం AI టెక్నాలజీ. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కు పెరుగుతున్న డిమాండ్. ముఖ్యంగా హైలెవెల్ AI చిప్‌ల (GPUs) లకు ఉన్న అపారమైన గిరాకీ ఇందుకు కారణం. ఈ చిప్‌లు అతిపెద్ద AI మోడళ్లకు శిక్షణ ఇవ్వడానికి (training) ,AI డేటా సెంటర్లను వృద్ధి చేసేందుకు అత్యవసరం కావడం కంపెనీ ఉత్పత్తులకు నిరంతర డిమాండ్‌ను సృష్టిస్తోంది.

Nvidia జూన్ 2023లో మొదటిసారిగా 1 ట్రిలియన్ డాలర్ల మార్కెట్ విలువను చేరుకుంది. కేవలం ఏడాది కాలంలోనే ఈ విలువను నాలుగు రెట్లు పెంచుకోవడం విశేషం. ఇది Apple ,Microsoft వంటి దిగ్గజాలు 3 ట్రిలియన్ డాలర్ల మార్కెట్‌ను చేరుకునేందుకు పట్టిన సమయం కంటే చాలా తక్కువ. 

Nvidia ప్రపంచంలోనే అత్యంత విలువైన ట్రేడ్ కంపెనీగా నిలిచింది. ప్రస్తుతం ఇది S&P 500 సూచీలో 7.3శాతం వెయిటేజీని కలిగి ఉంది. ఇది Apple 7శాతం, Microsoft 6శాతంకంటే ఎక్కువ. Nvidia మార్కెట్ వ్యాల్యూ  కెనడా, మెక్సికో ,యూకేలోని అన్ని పబ్లిక్‌గా లిస్ట్ చేయబడిన కంపెనీల మొత్తం మార్కెట్ విలువను మించిపోయింది.

►ALSO READ | ఇకపై భారత్‌లో స్టార్‌లింక్ ఇంటర్నెట్..IN-SPACE అనుమతితో ఉపగ్రహ సేవలు షురూ!

Nvidia అద్భుతమైన వృద్ధి దాని ఇటీవలి ఆర్థిక రిపోర్టులో స్పష్టంగా కనిపిస్తుంది. మొదటి త్రైమాసికంలో 44.1 బిలియన్ల డాలర్ల రాబడిని సూచించగా, ఇది గత సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే 69శాతం పెరిగింది. రెండవ త్రైమాసికానికి 45 బిలియన్ల డాలర్ల రాబడిని అంచనా వేస్తోంది. 

Nvidia భవిష్యత్తుపై అపారమైన ఆశావాదంతో ఉన్నారు మార్కెట్ విశ్లేషకులు. దాని బ్లాక్‌వెల్ AI ప్లాట్‌ఫారమ్ వంటి కొత్త ఆవిష్కరణలు రాబోయే కాలంలో మరింత వృద్ధికి దారితీస్తాయని అంచనా. Nvidia చిప్‌లు AI రంగంలో  కొత్త బంగారం ,చమురు వంటి విలువైనవిగా మారాయని విశ్లేషకులు అంటున్నారు. 

AI విప్లవానికి Nvidia కేంద్ర బిందువుగా ఉంది. దాని టెక్నాలజీ వివిధ పరిశ్రమలలో AI స్వీకరణను నడిపిస్తోంది. ఈ మైలురాయి AI అపారమైన సామర్థ్యాన్ని ,డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో పెరుగుతున్న దాని ప్రభావాన్ని స్పష్టం చేస్తుంది.