
వాషింగ్టన్: మరో ఆరు దేశాలకు షాకిచ్చాడు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్. గతంలో ప్రకటించిన ట్రేడ్ టారిఫ్స్ నిలిపివేత గడువు ముగియడంతో వివిధ దేశాలపై అదనపు సుంకాల మోత మోగిస్తున్నాడు. ఇందులో భాగంగానే సోమవారం (జూలై 7) భారత పొరుగు దేశం బంగ్లాదేశ్, జపాన్, దక్షిణ కొరియాతో సహా14 దేశాలపై దిగుమతి సుంకాలు విధించిన ట్రంప్.. బుధవారం (జూలై 9) మరో ఆరు దేశాలపై కొత్త రౌండ్ సుంకాలు విధించాడు.
ALSO READ | చరిత్ర సృష్టించిన Nvidia: ఇండియా GDP ని దాటిన కంపెనీ మార్కెట్‌క్యాప్
తాజాగా అల్జీరియా, బ్రూనై, ఇరాక్, లిబియా, మోల్డోవా, ఫిలిప్పీన్స్ దేశాలపై ట్రేడ్ టారిఫ్స్ విధించినట్లు ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్రూత్ ద్వారా వెల్లడించారు. అదనపు సుంకాలు విధించిన దేశాధినేతలకు ట్రంప్ నేరుగా లేఖలు పంపించారు. ఒక్కో దేశంపై ఒక్క రకంగా ట్రేడ్ టారిఫ్స్ విధించారు. ఇరాక్, అల్జీరియా, లిబియాపై అత్యధికంగా 30% సుంకాలు వేశారు. 2025, ఆగస్టు 1 నుంచి పెంచిన ఈ టారిఫ్స్ అమల్లోకి వస్తాయని ప్రకటించారు.
కొత్తగా సుంకాలు విధించిన ఆరు దేశాలు:
- ఇరాక్: 30%
- అల్జీరియా: 30%
- లిబియా: 30%
- ఫిలిప్పీన్స్: 25%
- బ్రూనై: 25%
- మోల్డోవా: 25%