హైదరాబాద్ HDFC ఏటీఎంలో దొంగలు పడ్డారు.. 40 లక్షలతో జంప్.. ట్విస్ట్ ఏంటంటే..

హైదరాబాద్ HDFC ఏటీఎంలో దొంగలు పడ్డారు.. 40 లక్షలతో జంప్.. ట్విస్ట్ ఏంటంటే..

హైదరాాబాద్: గ్యాస్ కట్టర్తో ఏటీఎం మిషన్ కట్ చేసి క్యాష్ బాక్స్ ఎత్తుకెళ్లిన ఘటన జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని మార్కండేయ నగర్లో ఉన్న HDFC ఏటీఎంలో బుధవారం వేకువజామున 3 గంటల సమయంలో నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు, 2 ద్విచక్రవాహనాలపై వచ్చి ఏటీఎం షెటర్ మూసి రెండు మిషన్లను గ్యాస్ కట్టర్ సహాయంతో కట్ జేసి 2 క్యాష్ బాక్స్లను దోచుకెళ్లారు. చోరీకి పాల్పడుతున్న సన్నివేశాలు ఏటీఎంలోని సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.

రెండు క్యాష్ బాక్స్లలో కలిపి 40 లక్షలు నగదు చోరీకి గురైందని బ్యాంక్ సిబ్బంది పోలీసులు ఫిర్యాదు చేశారు. అయితే అదే కాలనీలో 5 గంటల ముందు బాలా నగర్ ఏసీపీ ఆధ్వర్యంలో జీడిమెట్ల పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. అలాంటి పోలీసులకే సవాల్ విసురుతూ దొంగలు ఈ చోరీకి పాల్పడం గమనార్హం. దీనిని బట్టి దొంగలు గత కొద్ది రోజులుగా ఏటీఎం చోరీ చేసేందుకు గస్తీ నిర్వహించినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. పోలీసులు, కేసు నమోదు చేసి సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్లో కూడా నెల క్రితం ఇలాంటి ఘటనే జరిగింది. ఫార్చునర్ ​కారులో వచ్చిన ఇద్దరు దొంగలు గ్యాస్ ​కట్టర్తో కట్​చేసి ఏటీఎంలో డబ్బులు ఎత్తుకెళ్లారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లింగగిరి రోడ్డులోని ఎస్బీఐ ఏటీఎం వద్దకు మే 31న (శనివారం) అర్ధరాత్రి ఏటీఎంలోకి ఓ దొంగ వెళ్లి గ్యాస్ కట్టర్ తో కట్  చేస్తుండగా, మరో దొంగ షటర్ ను కిందకు దించి పరిసరాలను గమనించడం సీసీ కెమెరాలో రికార్డు అయింది. పక్కా ప్లాన్తో 15 నిమిషాల్లో ఏటీఎంను కట్  చేసి, అందులోని మనీ బాక్సులను బయటకు తీసుకొచ్చారు.

నగదును బయటకు తీసుకురాగానే షటర్  మూసివేసి ఏటీఎం రూమ్​ను తగలబెట్టి దుండగులు పరారయ్యారు. ఏటీఎంలో 2 రోజుల కింద రూ.20 లక్షలు పెట్టగా, ఆ డబ్బులన్నీ ఎత్తుకెళ్లినట్లు తెలుస్తోంది. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సీఐ చరమందరాజు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు.