CWC అనుమతి లేకుండానే మొదలు పెట్టారు.. కథ, స్క్రీన్ ప్లే , డైరెక్షన్ అన్నీకేసీఆరే..

CWC అనుమతి లేకుండానే మొదలు పెట్టారు.. కథ, స్క్రీన్ ప్లే , డైరెక్షన్ అన్నీకేసీఆరే..

 కాళేశ్వరం ప్రాజెక్ట్ కు కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అన్నీ కేసీఆరేనని పీసీ ఘోష్ కమిషన్ తేల్చిందన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. సీఎంహోదాలో  కేసీఆర్ ఇంజినీర్ లా వ్యవహరించి టెక్నికల్ అంశాల్లో జోక్యం చేసుకున్నారని ఉత్తమ్ అన్నారు. కాళేశ్వరం కమిషన్ రిపోర్టుపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా మాట్లాడిన ఉత్తమ్ ..  కాళేశ్వరం ప్రాజెక్టుకు కర్త, కర్మ,క్రియా అన్నీ కేసీఆరే..మేడిగడ్డ ఆయన వ్యక్తిగత నిర్ణయం అని ఉత్తమ్ చెప్పారు.  సీడబ్ల్యూసీ అనుమతి లేకుండానే  కాళేశ్వరం మొదలు పెట్టినట్లు కమిషన్ తేల్చిందన్నారు  మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.

కాళేశ్వరం కమిషన్ రిపోర్టు అంశాలు వెల్లడించిన ఉత్తమ్.. ఉద్దేశ్య పూర్వకంగానే  కాళేశ్వరం కట్టారని కమిషన్ నివేదిక ఇచ్చింది.  మూడు ప్రాజెక్టుల్లో సరైన నిర్వాహణ లేదు. నిర్లక్ష్యంగా,అక్రమంగా ,అసంబంధ్ధంగా ప్రాజెక్టు కట్టారని కమిషన్ చెప్పింది .ప్లానింగ్ డిజైనింగ్స్ మెయింటనెన్స్ లో విఫలం అయ్యింది.  సీఎంహోదాలో కేసీఆర్ ఇంజినీర్ లా వ్యవహరించారు.  కాళేశ్వరం ప్రాజెక్టు కర్త,కర్మ క్రియా అంతా కేసీఆరే.  సాంకేతిక అంశాల్లో కేసీఆర్ జోక్యం చేసుకున్నారు.  మేడిగడ్డ బ్యారేజ్ కేసీఆర్ వ్యక్తిగత నిర్ణయం.  ప్లానింగ్ ,డిజైన్లు,నిర్మాణంలో లోపాలు ఉన్నాయి. నిపుణుల కమిటీ సూచనలను కేసీఆర్ పట్టించుకోలేదు. సరైన ప్లాన్ లేకుండానే మేడిగడ్డ నిర్మాణం చేపట్టారు.  తొందరపాటు ఆమోదాలతో ప్రాజెక్టుకు నష్టాలు వచ్చాయి. 

కేసీఆర్ చెప్పినట్టే చేశామని అధికారులు వాంగ్మూలం ఇచ్చారు. నిబంధనలు ఉల్లంఘించి కాంట్రాక్టర్లకు మేలు జరిపారు.  అనుమతులు రాకుండానే కాంట్రాక్టర్లకు పనులు అప్పగించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడట్లేదు..  ప్రాజెక్టులో రాజకీయ జోక్యం, నిర్లక్ష్యం ఉంది.. రూల్స్ కు విరుద్దంగా నిర్మాణాలకు బడ్జెట్ రిలీజ్ చేశారు. ప్రాజెక్ట్ అంచనా వ్యయం పెంచి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు.  కాళేశ్వరం ప్రాజెక్టులో రాష్ట్ర ప్రభుత్వానికి భారీ నష్టం. కాంట్రాక్టర్ల లబ్ధి కోసం అంచనాలు పెంచారు. రాష్ట్రానికి బీఆర్ఎస్ హయాంలోనే పూర్తి నష్టం జరిగింది. కాళేశ్వరం అక్రమాలకు పూర్తి బాద్యత కేసీఆర్ దేనని కమిషన్ తేల్చింది. ఆయనపై  చర్యలు తీసుకోవాలని కమిషన్ సూచించింది . కేసీఆర్ పై చట్ట ప్రకారం తగిన చర్య తీసుకునే స్వేచ్ఛ సర్కార్ కు ఉంది.అని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు