భయపడకు మిత్రమా.. మంచి-చెడ్డ నేను చూసుకుంటా: గంగులతో సీఎం రేవంత్

భయపడకు మిత్రమా.. మంచి-చెడ్డ నేను చూసుకుంటా: గంగులతో సీఎం రేవంత్

హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్యే, కరీంనగర్ శాసనసభ్యుడు గంగుల కమలాకర్ను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రభుత్వం రిజర్వేషన్ల పరిమితిని ఎత్తివేసింది. ఈ మేరకు పంచాయతీ రాజ్ చట్టం2018 సవరణకు రిజర్వేషన్ల పరిమితిపై గత ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్స్ స్థానంలో ప్రత్యేక బిల్లును అసెంబ్లీలో ప్రభుత్వం ఆదివారం ప్రవేశపెట్టింది. ఈ సందర్భంగా.. బీసీ రిజ‌ర్వేష‌న్ల విష‌యంలో కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయాల‌ను గంగుల క‌మ‌లాక‌ర్ త‌ప్పుబ‌ట్టారు. గంగుల వ్యాఖ్యలపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

సీఎం రేవంత్ వ్యాఖ్యలు యథాతథంగా..
‘మిత్రులు గంగుల కమలాకర్ గారికి నా సూచన. ఈ ఒక్క విషయంలోనన్నా వాళ్ల ఒత్తిడికి లొంగకు. ఏమన్నా మంచి చెడ్డుంటే నేను చూస్కుంటా. నువ్వేం వాళ్లకు భయపడకు మిత్రమా. మంచి-చెడ్డేమన్న ఉంటే నేనున్నా. మనం పాత మిత్రులమే కద. నీకు తెల్వంది ఏముంది. వాళ్ల ఒత్తిడికి లొంగకు, వాళ్లకు ఇష్టం లేదు. వాళ్ల పోకడలు దగ్గరకెల్లి నువ్వు చూసినవ్. వాళ్ల పోకడలు ఎట్లుంటయో నీకు తెల్వదా. నేను చెప్పాల్నా.. నాకు వాళ్ల గురించి చానా తెలుసు కాబట్టే కర్రు కాల్చి వాత పెట్టి ఇక్కడొచ్చి కూర్చున్నా’ అని గంగుల కమలాకర్ను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.