రిలయన్స్ జియో కొత్త టెక్నాలజీ: ఇప్పుడు ఎం అడిగిన రియాతో చిటికెలో మీ ముందు..

 రిలయన్స్ జియో కొత్త టెక్నాలజీ:  ఇప్పుడు ఎం అడిగిన రియాతో చిటికెలో మీ ముందు..

రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) 48వ అన్యువల్ జనరల్ మీటింగు(AGM)లో జియో కొన్ని  కొత్త టెక్నాలజీలని లాంచ్ చేసింది. వాటిలో చాల ముఖ్యమైనది వాయిస్-ఎనేబుల్డ్ సెర్చ్ అసిస్టెంట్ RIYA, దీనిని జియో ఫ్రేమ్స్  ఇంకా PCలతో పరిచయం చేశారు.

కంటెంట్ సెర్చ్ మరింత ఈజీ: ఈ కొత్త వాయిస్ అసిస్టెంట్ RIYA సహాయంతో ఇప్పుడు వాయిస్ ద్వారా ఏదైనా కంటెంట్ కోసం  సెర్చ్ చేయవచ్చు. ఈ ఫీచర్  చాలా వేగంగా, సులభంగా సెర్చ్  ఫలితాలను ఇస్తుంది, ఇంకా వినియోగదారుల సమయాన్ని ఆదా చేయడమే కాకుండా స్మూత్  డిజిటల్ అనుభవాన్ని ఇస్తుంది.

మీ సొంత భాషలో కంటెంట్‌: జియో AGMలో వాయిస్ ప్రింట్ ఫీచర్‌ను కూడా ప్రవేశపెట్టింది, ఇది ప్రత్యేకంగా క్రీడలు ఇంకా ఎంటర్టైన్మెంట్  ప్రియుల కోసం. ఈ ఫీచర్ వినియోగదారులకు వారికీ ఇష్టమైన భారతీయ భాషలో కంటెంట్‌ను చూసే అవకాశాన్ని ఇస్తుంది. JioHotstar యాప్‌లో దీన్ని ఉపయోగించడం ద్వారా క్రికెట్, సినిమాలు ఇతర వినోద కంటెంట్‌ను మాతృభాషలో రియల్ వాయిస్, ఫుల్ లిప్-సింక్‌తో చూడవచ్చు.

ఈ ఫీచర్ ఎందుకు స్పెషల్ : భారతదేశ భాషా వైవిధ్యాన్ని దృష్టిలో ఉంచుకుని దీనిని రూపొందించారు. అలాగే వాయిస్ ప్రింట్ కంటెంట్ అనుభవాన్ని చాలా స్థానికంగా, వ్యక్తిగతంగా అనుభూతి ఇస్తుందని జియో చెబుతోంది. ఇంకా క్రికెట్ మ్యాచ్ అయినా లేదా బ్లాక్ బస్టర్ సినిమా అయినా ప్రజలు వారి స్వంత భాషలో చూడవచ్చు. ఇది డిజిటల్ వినోద అనుభవాన్ని మరింత వాస్తవికంగా, ఇంటరాక్టివ్‌గా చేస్తుంది.

భారతీయ ప్రేక్షకుల కోసం :  కోట్లాది భారతీయ ప్రేక్షకులను చేరుకునే దిశలో జియో ఈ అడుగు ముఖ్యమైనదిగా పరిగణిస్తుంది. దేశవ్యాప్తంగా వివిధ భాషలు మాట్లాడే ప్రజలు కూడా అదే టెక్నాలజీ అనుభవాన్ని పొందాలనేది కంపెనీ ఆలోచన.