సెప్టెంబర్ 7 చంద్రగ్రహణం : ఈ రాశుల వారు చాలా జాగ్రత్తగా ఉండాలి..

సెప్టెంబర్ 7 చంద్రగ్రహణం :   ఈ రాశుల వారు చాలా జాగ్రత్తగా ఉండాలి..

సెప్టెంబర్​ 7  వ తేదీన  చంద్రగ్రహణం.. బాధ్రపదమాసం పౌర్ణమి రోజున ఏర్పడుతుంది.  పండితులు తెలిపిన వివరాల ప్రకారం  రాత్రి 9:58కి మొదలై, సెప్టెంబర్ 8 తెల్లవారుజామున 1:26 వరకు ఉంటుంది.  ఈ సమయంలో కర్కాటక మరియు కుంభ రాశుల వారు జాగ్రత్తగా ఉండాలని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు. 

ఈ ఏడాది ( 2025) సెప్టెంబర్ 7 న చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఆ రోజు రాత్రి 11:42 గంటలకు చంద్రుడు సంపూర్ణంగా కనపడడు. భారతదేశంలో ఈ గ్రహణం కనపడుతుంది. కావున సూతకాలం వర్తిస్తుంది. జ్యోతిష్య నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం   కర్కాటక.. కుంభ రాశిలో రాహుగ్రస్త చంద్రగ్రహణం ఏర్పడుతుంది.  ఈ రెండు రాశుల వారు చంద్రగ్రహణాన్ని ఎట్టి పరిస్థితిలో చూడకూడదు. 

కర్కాటక రాశి:   ఈ రాశి వారు చంద్రగ్రహణాన్ని చూడకూడదు.  గ్రహణం సమయంలో శివుడిని ధ్యానం చేస్తూ ఉండాలి.  వీరికి అనుకోకుండా కొన్ని అవాంఛనీయ ఘటనలు ఎదురవుతాయి.  వీటివల్ల మనసులో ఆందోళన నెలకొంటుంది.  ఏ కారణం లేకుండా గొడవలు వచ్చే అవకాశం ఉంది.  వ్యక్తిగత సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. . చంద్రుని ఆశీస్సులు పొందడానికి శివ పంచాక్షరి మంత్రాన్ని పఠించాలని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు. 

కుంభ రాశి:  ఈ రాశి వారు చంద్రగ్రహణ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.  చంద్రుడు కుంభరాశిలో సంచరించే సమయంలో చంద్రగ్రహణం ఏర్పడనుంది.  రాహువు కూడా  కుంభ రాశిలో ఉన్నాడు. అందువల్ల చంద్రుడు, రాహువు కలయిక వలన కుంభ రాశి వారిపై ప్రతికూల ప్రభావాన్ని ఉంటుంది. మానసిక ఒత్తిడి సమస్య ఉంటుంది. ఎవరితోనైనా వివాదం ఏర్పడవచ్చు. మనస్సు గందరగోళంగా ఉంటుంది. చంద్రగ్రహ దోష పరిహారం.. రాహువు చెడు దృష్టి నుంచి రక్షించుకోవడానికి మహామృత్యుంజయ మంత్రాన్ని జపం చేయాలని పండితులు సూచిస్తున్నారు.

పరిహారాలు 

  • సెప్టెంబర్​ 8 వ తేది ఉదయం.. చంద్రుడికి అభిషేకం చేయాలి.
  • శివుడిని అర్చించాలి. 
  • నవగ్రహాలున్న ప్రదేశంలో చంద్రుడిని .. నీటితో కడిగి తెల్లటి వస్త్రాన్ని సమర్పించాలి. 
  • రాహు గ్రహానికి పూజ
  • బెల్లం నివేదన సమర్పించాలి.
  • కేజీం పావు బియ్యం.. మినుములు.. తెల్ల బట్టలు.. దానం ఇవ్వాలి
  • బ్రాహ్మణుడికి వస్త్రదానం.. స్వయంపాకం ఇవ్వాలి.
  • శక్తి మేరకు పేదలకు ధనసహాయం చేయాలి