
కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రపంచంలోనే అతిపెద్ద మ్యాన్ మేడ్ డిజాస్టర్ అని ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. కాశేశ్వరం కమిషన్ రిపోర్టుపై అసెంబ్లీలో చర్చ సందర్బంగా మాట్లాడిన ఉత్తమ్..లక్ష కోట్లు ఖర్చు పెట్టినా కొత్త ఆయకట్టు లక్ష ఎకరాలు కూడా పెరగలేదన్నారు. లక్ష కోట్లు ఖర్చు చేసినా ఐదేళ్లలో వాడుకున్న నీళ్లు 101 టీఎంసీలేనని చెప్పారు ఉత్తమ్. స్వతంత్ర భారతదేశంలో ఫైనాన్షియల్ డిజాస్టర్ కాళేశ్వరం ప్రాజెక్ట్ అని అన్నారు ఉత్తమ్. మేడిగడ్డ కుంగినపుడు కేసీఆరే సీఎంగా ఉన్నారని చెప్పారు.
అసెంబ్లీలో పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టుపై మాట్లాడిన ఉత్తమ్.. తెలంగాణ ఏర్పడ్డాక అతిపెద్ద ప్రాజెక్టుగా కాళేశ్వరం చేపట్టారు. రూ. 87,449 కోట్లతో ప్రాజెక్ట్ చేపట్టారు. కాళేశ్వరానికి గుండెకాయ లాంటి మేడిగడ్డ కూలింది. రూ. 24వేల కోట్లతో చేపట్టిన మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోయింది. 20 నెలలుగా అన్నారం, సుందిళ్ల,మేడిగడ్డ నిరూపయోగంగా ఉన్నాయి. అవకతవకలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది. డిజైన్, నిర్మాణం, నాణ్యతలో లోపాలున్నాయని కమిషన్ చెప్పింది. పనుల పర్యవేక్షణలో లోపాలున్నాయని నివేదికలో వెల్లడించింది. సరైన ప్రణాళిక లేకుండా మేడిగడ్డ చేపట్టారని కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది. భూగర్భ జలాలు దృష్టిలో పెట్టుకుని ప్రాజెక్టు కట్టలేదని తేల్చింది.
ప్రాణహిత చేవెళ్లను 2013లో అప్పటి ప్రభుత్వం ప్రారంభించింది.. 2014 నాటికి 11 వేల కోట్లు ఖర్చు పెట్టారు. 38 వేల 500 కోట్లతో పూర్తయ్యే ప్రాణహిత చేవెళ్లను..అకారణంగా రీజన్ లేకుండా కేసీఆర్ ప్రాజెక్టు డిజైన్ ను మార్చారు. లక్షా 47 వేలకోట్లకు పెంచారు. ఏడాదికి 195 టీఎంసీలు ఎత్తిపోస్తామని చెప్పి ప్రాజెక్టు కట్టి..ఐదేళ్లలో 125టీఎంసీలు మాత్రమే ఎత్తిపోశారు. లక్ష కోట్లు ఖర్చు పెట్టి ఏడాదికి కొత్త ఆయకట్టు లక్ష ఎకరాలు కూడా పారలేదు. లక్ష కోట్లు ఖర్చు చేసినా ఐదేళ్లలో వాడుకున్న నీళ్లు 101 టీఎంసీలే. ఇది మ్యానే మేడ్ డిజాస్టర్..ప్రపంచంలోనే ఇలాంటిదిఎక్కడా జరగలేదు. స్వతంత్ర భారతదేశంలో ఫైనాన్షియల్ డిజాస్టర్. మేడిగడ్డ కుంగినపుడు కేసీఆర్ సీఎంగా ఉన్నారు. 2023అక్టోబర్ 21న మేడిగడ్డ బ్యారేజీ కుంగింది.
బ్యారేజీ కట్టి డ్యాంలా వాడుకోవాలని చూశారు. అందుకే మేడిగడ్డ కూలిందని ఎన్డీఎస్ ఏ తేల్చింది. అధికారులు హెచ్చరించినా నీటి నిల్వ తగ్గించలేదు. పిల్లర్ల నుంచి ఇసుకు కొట్టుకుపోయింది. కాళేశ్వరం వాడకున్నా రికార్డ్ స్థాయిలో పంట పండింది.మీ హయాంలో కట్టిన ప్రాజెక్టు..మీ హయాంలోనే కూలింది..మిమ్మల్ని చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు. ఎన్డీఎస్ ఏ రిపోర్టు ప్రకారమే కాళేశ్వరంలో నీళ్లు నిల్వ చేయలేదు అని ఉత్తమ్ చెప్పారు.