
షార్జాలో జరుగుతున్న ట్రై సిరీస్ లో పాకిస్థాన్ క్రికెటర్ మహమ్మద్ హారీస్ తన చేష్టలతో తీవ్ర విమర్శలకు గురవుతున్నాడు. ట్రై సిరీస్ లో భాగంగా శనివారం (ఆగస్టు 30) పాకిస్థాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో పాక్ యువ బ్యాటర్ హారీస్ తన సహనాన్ని కోల్పోయాడు. ఈ మ్యాచ్ లో పాకిస్థాన్ మొదట బ్యాటింగ్ చేస్తూ బాగా ఆడుతోంది. ఏడో స్థానంలో బ్యాటింగ్ కు దిగిన హారీస్ కేవలం ఒక పరుగు మాత్రమే చేసి నిరాశపరిచాడు. ఇన్నింగ్స్ డెత్ ఓవర్లలో జునైద్ సిద్ధిక్ బౌలింగ్ లో షాట్ ఆడడానికి ప్రయత్నించి ముహమ్మద్ జవాదుల్లాకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.
ఒక్క పరుగుకే ఔట్ కావడంతో హారీస్ తీవ్ర నిరాశకు గురయ్యాడు. ఆ సమయంలో తన ఎమోషన్స్ అదుపులో పెట్టుకోలేకపోయాడు. తన బ్యాట్ ను నేలకేసి గట్టిగా కొట్టాడు. దీంతో బ్యాట్ హ్యాండిల్ దగ్గర విరిగిపోయింది. విరిగిన బ్యాట్ ను కోపంతో రెండు ముక్కలు చేసి పెవిలియన్ కు వెళ్ళాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. హారీస్ ప్రవర్తనపై విమర్శలు వస్తున్నాయి. కొంతమంది ఫ్యాన్స్ అతని నిరాశకు సానుభూతి వ్యక్తం చేయగా, మరికొందరు అలాంటి ఆవేశం అనవసరాని సూచించారు.
ఈ మ్యాచ్ విషయానికి వస్తే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ పై పాకిస్థాన్ 31 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ టోర్నీ తొలి మ్యాచ్ లో ఆఫ్ఘనిస్తాన్ పై నెగ్గిన పాక్.. శనివారం యూఏఈపై విజయంతో ట్రై సిరీస్ లో వరుసగా రెండో విజయాన్ని అందుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 207 పరుగులకు ఆలౌట్ అయింది. ఓపెనర్ సైమ్ అయూబ్ (69), హాసన్ నవాజ్ (54) హాఫ్ సెంచరీలతో రాణించారు. లక్ష్య ఛేదనలో యూఏఈ 8 వికెట్ల నష్టానికి 176 పరుగులకు పరిమితమైంది. సైమ్ అయూబ్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.
This was silly bud...really silly. pic.twitter.com/WK9zB3h3xK
— Aatif Nawaz (@AatifNawaz) August 30, 2025