సన్ బాత్ చేస్తుండగా ట్రంప్‌ను చంపుతాం: ఇరాన్ అధికారి బెదిరింపులు

సన్ బాత్ చేస్తుండగా ట్రంప్‌ను చంపుతాం: ఇరాన్ అధికారి బెదిరింపులు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చంపుతామని ఇరాన్ నుంచి బెదిరింపులు వచ్చాయి. స్వయంగా ఇరాన్ సుప్రీం లీడర్ సలహాదారు ఈ బెదిరింపులకు పాల్పడటం సంచలనంగా మారింది. డొనాల్డ్ ట్రంప్ తన విలాసవంతమైన ఫ్లోరిడా ఇంట్లో ఇకపై సురక్షితంగా సన్ బాత్ చేయలేరని హెచ్చరించారు.   ఇరాన్ ,US మధ్య దీర్ఘకాలంగా కొనసాగుతున్న సంఘర్షణలో ఈ హత్య బెదిరింపులు కొత్త దశను సూచిస్తున్నాయి.. వివరాల్లోకి వెళితే.. 

ఇరాన్‌కు చెందిన సీనియర్ అధికారి డోనాల్డ్ ట్రంప్‌ను ఫ్లోరిడాలోని మార్- ఎ- లాగోలో హత్య చేస్తామని బెదిరించారు. ఇరాన్ సుప్రీం లీడర్ సలహాదారు జవాద్ లారిజాని ఇరాన్ టెలివిజన్‌లో చేసిన వ్యాఖ్యల్లో డోనాల్డ్ ట్రంప్ తన విలాసవంతమైన ఫ్లోరిడా ఇంట్లో ఇకపై సురక్షితంగా సన్ బాత్ చేయలేరని హెచ్చరించారు.
ట్రంప్ చేసిన పని వలన అతను మార్-ఎ-లాగోలో ఇకపై సన్ బాత్ చేయలేడు..అతను తన పొట్టను సూర్యుడికి పెట్టి అక్కడ పడుకున్నప్పుడు..ఒక చిన్న డ్రోన్ అతని బొడ్డులో తగలొచ్చు. ఇది చాలా సులభమే అని సీనియర్ అధికారి చెప్పడం సంచలనంగా మారింది. 

ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనిని బెదిరించే వారిపై ప్రతికారం కోసం ఇటీవల  ఆన్ లైన్ ప్లాట్ ఫాం కూడా ఏర్పాటు చేశారు ఖమేనీ  మద్దతుదారులు. దీనికి "బ్లడ్ పాక్ట్" అని పేరు పెట్టారు. ఈ సైట్ ఇప్పటివరకు 40 మిలియన్ల డాలర్లకుపైగా నిధులు సేకరించినట్లు తెలుస్తోంది. దేవుని శత్రువులను, అలీ ఖమేనీ ప్రాణానికి ముప్పు కలిగించే వారిని న్యాయస్థానానికి తీసుకువచ్చే ఎవరికైనా మేం గిఫ్ట్ అందజేస్తామని బ్లడ్ పాక్ట్ హోమ్‌పేజీలో ఒక ప్రకటన ఉంది. డోనాల్డ్ ట్రంప్‌ను చంపడానికి 100 మిలియన్ల డాలర్లను  సేకరించడం ఈ ప్రచార లక్ష్యంగా తెలుస్తోంది. ఈ సైట్‌ను ఎవరు నిర్వహిస్తున్నారనేది అస్పష్టంగా ఉంది.

2020లో ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) జనరల్ ఖాస్సేం సులేమానిని చంపమని ట్రంప్ ఆదేశించినప్పటి నుంచి హత్య బెదిరింపులకు గురవుతున్నారు.  గతేడాది IRGC సులేమానీ హత్యకు ప్రతీకారంగా ట్రంప్‌ను చంపడానికి పథకం పన్నినట్లు ప్లాన్‌ను రూపొందించిందని  US లా ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆరోపించింది.

ఇరాన్ ,US మధ్య దీర్ఘకాలంగా కొనసాగుతున్న సంఘర్షణలో ఈ హత్య బెదిరింపులు కొత్త దశను సూచిస్తున్నాయి. ఇది 2020లో ఖాస్సేం సులేమాని హత్యతో మరింత తీవ్రమైంది.