
హైదరాబాద్: రాజీవ్ గాంధీ సివిల్స్ అభయ హస్తం దరఖాస్తుల స్వీకరణ గడువును జులై 12వ తేదీ వరకు పొడిగించినట్లు సింగరేణి సీఎండీ ఎన్.బలరామ్ ఒక ప్రకటన లో తెలిపారు. ఈ పథకం ద్వారా తెలంగాణ రాష్ట్రం నుంచి సివిల్స్ ప్రిలిమ్స్ లో పాసై మెయిన్స్ కు హాజరవుతున్న అభ్యర్థులకు ఒక్కొక్కరికి లక్ష రూపాయల ఆర్థిక ప్రోత్సాహకాన్ని అందిస్తున్నట్లు వెల్లడించారు.
దరఖాస్తుల స్వీకరణకు గతంలో ఇచ్చిన గడువు తేదీ జులై 7వ తేదీతో ముగిసిపోయిందని.. అయితే అభ్యర్థుల నుంచి వస్తున్న విజ్ఞప్తుల మేరకు జులై 12వ తేదీ వరకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల ని సూచించారు. అలాగే సివిల్స్ ప్రిలిమ్స్ పాసైన సింగరేణి ఉద్యోగుల పిల్లలకూ రూ.ల క్ష చొప్పున ప్రోత్సాహకం అందించనున్నట్లు తెలిపారు.
►ALSO READ | తెలంగాణలో యూరియా కొరత లేకుండా చూస్తాం