IND vs SL: బంగ్లా స్థానంలో లంక: టీమిండియాతో శ్రీలంక వన్డే, టీ20 సిరీస్

IND vs SL: బంగ్లా స్థానంలో లంక: టీమిండియాతో శ్రీలంక వన్డే, టీ20 సిరీస్

బంగ్లాతో వైట్ బాల్ ఫార్మాట్ సిరీస్ రద్దు కావడంతో ఆగస్ట్ నెలలో టీమిండియా శ్రీలంకకు పర్యటించే సూచనలు కనిపిస్తున్నాయి. బంగ్లా సిరీస్ కు బ్రేక్ పడడంతో ఇంగ్లాండ్ తో టెస్ట్ సిరీస్ ముగిసిన తర్వాత టీమిండియాకు రెండు నెలల విరామం లభించనుంది. అయితే ఈ గ్యాప్ లో టీమిండియా ఫ్యాన్స్ కు త్వరలోనే ఒక గుడ్ న్యూస్ అందే అవకాశం ఉంది. బీసీసీఐ, శ్రీలంక క్రికెట్ బోర్డు కలిసి ఇండియా, బంగ్లా సిరీస్ ను ఇండియా, శ్రీలంక సిరీస్‌తో భర్తీ చేయడానికి చర్చలు ప్రారంభించినట్టు సమాచారం. ఈ టూర్ లో భాగంగా శ్రీలంకతో మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్ లు ఆడనుంది. 

శ్రీలంక ప్రీమియర్ లీగ్ కూడా వాయిదా పడడంతో ఈ సిరీస్ జరిగేందుకు ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆగస్టు 29 నుంచి బంగ్లాదేశ్ లో శ్రీలంక పర్యటించనుంది. దీంతో ఈ సిరీస్ కు రెండు వారల ముందు టీమిండియాతో సిరీస్ జరిపేందుకు ఇరు దేశాల బోర్డులు ప్రయత్నాలు చేస్తున్నారు. లంక వైట్ బాల్ టూర్ కు భారత బి జట్టును పంపే అవకాశం ఉంది. రోహిత్, కోహ్లీతో పాటు ఇండియా టెస్ట్ ఆటగాళ్లకు రెస్ట్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి.

►ALSO READ | Vaibhav Suryavanshi: వైభవ్ సూర్యవంశీ ముందు అదే అతి పెద్ద ఛాలెంజ్: 14 ఏళ్ళ క్రికెటర్‌కు ధావన్ సలహా

చివరిసారిగా శ్రీలంకలో పర్యటించిన భారత జట్టు వన్డేల్లో 1-2 తేడాతో సిరీస్ ఓడిపోయింది. రోహిత్, కోహ్లీ ఇద్దరూ ఈ సిరీస్ ఆడినప్పటికీ టీమిండియాకు సిరీస్ ఓటమి తప్పలేదు. ప్రస్తుతం ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న టీమిండియా ఆగస్టు 4 సమయానికి 5 మ్యాచ్ ల టెస్టు సిరీస్ పూర్తి చేసుకుంటుంది. ఆ తర్వాత స్వదేశంలో అక్టోబర్ తో రెండు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ ఉంటుంది.

అసలేం జరిగిందంటే..? 

ఆగస్ట్ నెలలో బంగ్లాదేశ్ లో టీమిండియా పర్యటన వాయిదా పడిన సంగతి తెలిసిందే. మూడు వన్డేలు, మూడు ట్వంటీ 20  మ్యాచ్‌ల సిరీస్ ను ఆగస్టు 2025 నుండి సెప్టెంబర్ 2026కి మార్చారు.షెడ్యూల్ ప్రకారం టీమిండియా ఆగస్టు నెలలో బంగ్లాదేశ్ తో మూడు వన్డేలతో పాటు మూడు టీ20 మ్యాచ్ లు ఆడనుంది. బంగ్లాదేశ్‌లో నెలకొన్న రాజకీయ అశాంతి కారణంగానే ఈ సిరీస్ వాయిదా పడినట్టు తెలుస్తుంది. భద్రతాపరమైన ఆందోళనల నేపథ్యంలో ఈ పర్యటనకు భారత కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. దీంతో సిరీస్ ను ఇరు జట్ల బోర్డులు వాయిదా వేసినట్టు అధికారికంగా తెలిపారు.