Wiaan Mulder: ముల్డర్ బయపడ్డాడు.. తప్పు చేశాడు.. నేనైతే కొట్టేవాడిని: సఫారీ ఆల్ రౌండర్‌పై గేల్ విమర్శలు

Wiaan Mulder: ముల్డర్ బయపడ్డాడు.. తప్పు చేశాడు.. నేనైతే కొట్టేవాడిని: సఫారీ ఆల్ రౌండర్‌పై గేల్ విమర్శలు

సౌతాఫ్రికా ఆల్ రౌండర్ వియాన్ ముల్డర్ టెస్టుల్లో లారా సాధించిన 400 పరుగుల వ్యక్తిగత స్కోర్ ను బ్రేక్ చేసేందుకు సువర్ణావకాశం లభించినా వదులుకోవడం ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. బులవాయో వేదికగా  క్వీన్స్ స్పోర్ట్స్ క్లబ్ లో ముగిసిన రెండో టెస్టు రెండో రోజు 367 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఉన్నప్పుడు సౌతాఫ్రికా తమ ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. దీంతో ప్రపంచ క్రికెట్ మొత్తం ఒక్కసారిగా షాక్ కు గురైంది. లంచ్ తర్వాత రెండో సెషన్ లో ఈ సఫారీ కెప్టెన్ లారా రికార్డ్ బ్రేక్ చేస్తాడని క్రికెట్ అభిమానులు ఉత్కంఠగా ఎదురు చూసిన వారికి నిరాశే మిగిలింది. ముల్డర్ నిర్ణయంపై వెస్టిండీస్ విధ్వంసకర వీరుడు క్రిస్ గేల్ విమర్శలు వ్యక్తం చేశాడు.

ఒక రేడియో కార్యక్రమంలో మాట్లాడుతూ.. గేల్ తన నిర్ణయం పట్ల నిరాశ వ్యక్తం చేశాడు. అలాంటి అవకాశం వచ్చినప్పుడు వదులుకోకూడదని ప్రశ్నించాడు. " నాకు 400 పరుగులు చేసే అవకాశం వస్తే.. నేను 400 పరుగులు చేసేవాడిని. ఇలాంటి అవకాశం ఎప్పుడో ఒకసారి మాత్రమే జరుగుతుంది. ముల్డర్ మళ్ళీ ఎప్పుడు ట్రిపుల్ సెంచరీ చేస్తారో తెలియదు. మీకు అవకాశం దొరికినప్పుడు  మీరు భయపడకూడదు. రికార్డ్ బ్రియాన్ లారాతోనే ఉండాలని కోరుకుంటున్నానని చెప్పాడు. బహుశా అతను భయాందోళనకు గురై ఉండవచ్చు. ఆ పరిస్థితిలో ఏమి చేయాలో అతనికి తెలియలేదు. నేను చెప్పినట్లుగా, అతను భయపడ్డాడు. రికార్డ్ బ్రేక్ చేయకుండా తప్పు చేశాడు". అని గేల్ చెప్పుకొచ్చాడు. 

►ALSO READ | కళ్లు చెదిరే రేంజ్‎కు పెరిగిన IPL బ్రాండ్ వాల్యూ.. ముంబై, చెన్నైని వెనక్కి నెట్టి టాప్ ప్లేస్‎కు ఆర్సీబీ

ఈ మ్యాచ్ లో సౌతాఫ్రికా కెప్టెన్ ముల్డర్ కావడం విశేషం. కెప్టెన్ గా ముల్డర్ జట్టు విజయం తీసుకున్న ఈ నిర్ణయం అందరి మనసులను గెలుచుకుంది. లంచ్ తర్వాత 5-10 ఓవర్లు సౌతాఫ్రికా బ్యాటింగ్ చేసినా లారా రికార్డ్ ను ముల్డర్ బ్రేక్ చేసేవాడు. అయితే 34 పరుగుల దూరంలో ప్రపంచ రికార్డ్ ఉన్నప్పటికీ తాను నిస్వార్ధంగా జట్టు కోసం ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేశాడు. దీంతో 367 పరుగులతో ముల్డర్ నాటౌట్ గా తన ఇన్నింగ్స్ ను ముగించాడు. దీంతో లారా రికార్డ్ పదిలంగా మిగిలింది. ఈ మ్యాచ్ లో ఓవరాల్ గా ముల్డర్ 334 బంతుల్లో 44 ఫోర్లు, 4 సిక్సర్లతో 367 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఈ నిర్ణయంపై కొంతమంది ప్రశంసించినా మరికొందరు నిరాశకు గురయ్యారు. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Cricketangon (@cricketangon)