రాష్ట్రానికి ముగ్గురు ఐపీఎస్​ల కేటాయింపు

రాష్ట్రానికి ముగ్గురు ఐపీఎస్​ల కేటాయింపు

న్యూఢిల్లీ, వెలుగు: రాష్ట్రానికి కేంద్రం కొత్తగా ముగ్గురు ఐపీఎస్​లను కేటాయించింది. 2021 బ్యాచ్ కు చెందిన ఆర్ వెంకటేశ్వర్లు, సీహెచ్ శ్రీనివాస్, డీ మురళీధర్ ను కేటాయిస్తూ సోమవారం కేంద్ర హోం శాఖ ఉత్తర్వులు రిలీజ్ చేసింది. వీరంతా ఒక ఏడాది పాటు ప్రొబేషన్ పిరియడ్ లో ఉంటారని సెక్రటరీ రమణ్​ కుమార్ తెలిపారు. ఈ ఉత్తర్వులను సీఎస్, యూపీఎస్సీ, రాష్ట్ర డీజీపీ, సర్దార్ వల్లభాయ్ పటేల్  నేషనల్ పోలీస్ అకాడమీ డైరెక్టర్, ఇతర శాఖలకు పంపారు.