
బ్యాంక్ ఖాతా దారులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) గుడ్ న్యూస్ చెప్పింది. బేసిక్ సేవింగ్స్ బ్యాంకు డిపాజిట్ ఖాతాలు (బీఎస్‌బీడీఏ), లేదా నో ఫ్రిల్స్ అకౌంట్స్‌గా పిలిచే ఖాతాల్లో కనీస నగదు నిల్వ ఉండాలన్న నిబంధనను ఎత్తివేసింది. ఈ మేరకు సోమవారం ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు విత్ డ్రాలపై నిబంధనలను కూడా మార్చింది. నెలకు 4 సార్లు బ్యాంకులు, ఏటీఎంల నుంచి డబ్బులు విత్ డ్రా చేసుకునే వెసులుబాటు కల్పించింది. బ్యాంకు ఖాతాల్లో ఎన్నిసార్లైన డిపాజిట్ చేసుకునే సదుపాయంతోపాటు ఫ్రీ ఏటీఎం, డెబిట్ కార్డు జారీ, యాక్టివేషన్ ఛార్జీలు వసూలు చేయరాదని ఆదేశించింది. ఈ మేరకు అన్ని బ్యాంకులకు కేంద్ర బ్యాంకు ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలు జూలై 1వ తేదీ నుంచి అమలులోకి రానున్నాయి.