హైదరాబాద్ లో అర్థరాత్రి వరకు వ్యాపారాలకు పర్మిషన్ ఇవ్వండి

హైదరాబాద్ లో అర్థరాత్రి వరకు వ్యాపారాలకు పర్మిషన్ ఇవ్వండి

ఆల్ ఇండియా మజ్లిస్ ఇ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (AIMIM) పార్టీ ఎమ్మెల్యేల బృందం జనవరి 11న హైదరాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీనివాస రెడ్డిని కలిశారు. చిరు వ్యాపారులు, హోటల్ యజమానులను హైదరాబాద్ పోలీసులు వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ మొహియుద్దీన్, చార్మినార్ ఎమ్మెల్యే మీర్ జుల్ఫెకర్ అలీ కమిషనర్‌తో భేటీ అయ్యారు. ఈ క్రమంలో మెహదీపట్నం, రేతి బౌలి, పట్టెరగట్టి, లాడ్ బజార్, చార్మినార్, టోలీచౌకి, 7 సమాధులు, గోల్కొండ, ఆసిఫ్‌నగర్, అమీర్‌పేట తదితర ప్రాంతాల్లోని చిరువ్యాపారులకు/వీధి వ్యాపారులకు ట్రాఫిక్ పోలీసులు భారీ జరిమానాలు విధిస్తున్నారని సీపీకి తెలిపారు.

నగరంలోని హోటళ్లు, ఇతర వ్యాపార సంస్థలకు అర్థరాత్రి వరకు అనుమతి ఇవ్వాలని ఎమ్మెల్యేలు సీపీ దృష్టికి తీసుకెళ్లారు. వారి ఆరోపణలపై స్పందించిన సీపీ శ్రీనివాస రెడ్డి... ఎమ్మెల్యేల సమస్యలను పరిశీలించి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.