వ్యాక్సిన్ తీసుకున్న వారికే మాల్స్ లోకి ఎంట్రీ

వ్యాక్సిన్ తీసుకున్న వారికే మాల్స్ లోకి ఎంట్రీ

తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య తగ్గినట్లే తగ్గి..మళ్లీ పెరుగుతున్నాయి. దీంతో గాంధీ సహా వివిధ ఆస్పత్రుల్లో బాధితులు రోజురోజుకి పెరుగుతున్నారు. ఈ క్రమంలో తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వ్యాక్సిన్ తీసున్నవారిని మాత్రమే బహిరంగ ప్రదేశాలల్లో అనుమతించాలని నిర్ణయించింది. టీకా తీసుకున్న వ్యక్తులకు మాత్రమే మాల్స్, సినిమా థియేటర్లు, రెస్టారెంట్లు వంటి బహిరంగ ప్రదేశాలల్లో అనుమతించాలని తెలంగాణ ప్రజారోగ్య డైరెక్టర్ జి శ్రీనివాసరావు సూచించారు. ఇందుకోసం రాష్ట్రంలో వ్యాక్సిన్ పాస్‌ను ప్రవేశపెట్టవచ్చని తెలిపారు.

థర్డ్ వేవ్ హెచ్చరికల క్రమంలో ప్రజలు కరోనా రూల్స్ తప్పకుండా పాటించాలన్నారు. రాబోయే రోజుల్లో, మాల్స్‌, రెస్టారెంట్లు, సినిమా థియేటర్ల వంటి ఇతర వాణిజ్య సంస్థలను సందర్శించే వ్యక్తులకు టీకా వేసుకుంటేనే అనుమతి ఉంటుందని వివరించారు. ఇప్పటికే పలు దేశాలు ఈ విధంగా చర్యలు తీసుకున్నాయని తెలిపారు. తాము కూడా అలాంటి కఠినమైన చర్యలు తీసుకోకపోతే పరిస్థితి క్లిష్టంగా మారే ప్రమాదం ఉందన్నారు. రాష్ట్రంలో కరోనా కేసులు పెరగకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు.థర్డ్ వేవ్ రాకుండా ప్రజలు తప్పనిసరిగా సొంత జాగ్రత్తలు పాటించాలని కోరారు. ప్రభుత్వం కరోనా ఆంక్షలను ఎత్తివేసిందని.. ప్రజలు ఇంట్లో ఉన్నా బయటకి వెళ్లినా మాస్కులు ధరించాలని సూచించారు.