AA22 : అట్లీతో మూవీపై అప్డేట్ .. ఐకాన్​గా వస్తున్నా అల్లు అర్జున్

AA22 : అట్లీతో మూవీపై అప్డేట్ ..  ఐకాన్​గా వస్తున్నా అల్లు అర్జున్

అల్లు అర్జున్ హీరోగా తమిళ దర్శకుడు అట్లీ కాంబినేషన్‌‌‌‌లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి  తెలిసిందే. హాలీవుడ్ టెక్నీషియన్స్‌‌‌‌తో  పాన్ వరల్డ్ ప్రాజెక్టుగా భారీ బడ్జెట్‌‌‌‌తో దీన్ని రూపొందిస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించగా ఈ చిత్రంపై అంచనాలు రెట్టింపు అయ్యాయి. తాజాగా ఈ మూవీ టైటిల్ విషయంలో ఓ న్యూస్ వైరల్ అవుతోంది. ఈ చిత్రానికి ‘ఐకాన్’ అనే టైటిల్‌‌‌‌ను ఫిక్స్ చేశారనే టాక్ వినిపిస్తోంది. ఐకాన్ స్టార్‌‌‌‌‌‌‌‌గా పిలవబడే బన్నీకి ఈ టైటిల్ యాప్ట్ అని టీమ్ భావిస్తోందట. అయితే ఈ టైటిల్‌‌‌‌ను గతంలో  దిల్ రాజు సంస్థ ఎప్పుడో రిజిస్టర్ చేయించుకొంది. వేణు శ్రీ‌‌‌‌రామ్ దర్శకత్వంలో, అల్లు అర్జున్ హీరోగా ఈ సినిమా మొద‌‌‌‌లు పెట్టాల‌‌‌‌ని చూసింది.

  వేణు శ్రీ‌‌‌‌రామ్ స్క్రిప్ట్ కూడా త‌‌‌‌యారు చేశాడు. కానీ ఎందుకో ఆ ప్రాజెక్ట్ ముందుకు వెళ్లలేదు. దీంతో ఈ టైటిల్‌‌‌‌ను అట్లీ మూవీకి పెట్టాలనుకుంటున్నట్టు తెలుస్తోంది.  దీనిపై అఫీషియల్ అనౌన్స్‌‌‌‌మెంట్ రావాల్సి ఉంది.  ప్రస్తుతం ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇందులో ఐదుగురు హీరోయిన్స్ నటించనున్నారనే ప్రచారం జరుగుతోంది.  ఈ ఏడాది ఆఖరిలో రెగ్యులర్  షూటింగ్ స్టార్ట్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు.  సన్ పిక్చర్స్ బ్యానర్‌‌‌‌పై కళానిధి మారన్ ‌‌‌‌భారీ బడ్జెట్‌‌‌‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.