త్రివిక్రమ్ పెన్ను పవర్..ఇక పాన్ ఇండియా లెవెల్లో..అల్లు అర్జున్ ఫ్యాన్స్..గెట్ రెడీ

త్రివిక్రమ్ పెన్ను పవర్..ఇక పాన్ ఇండియా లెవెల్లో..అల్లు అర్జున్ ఫ్యాన్స్..గెట్ రెడీ

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్(Trivikram Srinivas) తన డైలాగ్స్తో సినిమాలను హిట్ ట్రాక్ లోకి తీసుకొస్తాడు. హీరోలకే కాకుండా డైరెక్టర్స్కి కూడా ఫ్యాన్స్ ఉండటంలో త్రివిక్రమ్ ఒకరు. ఎప్పుడు తన మూవీస్లో స్టోరీకి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వని త్రివిక్రమ్..ఈ సారి అదిరిపోయే స్టోరీని రెడీ చేశారని టాక్ వినిపిస్తోంది. 

లేటెస్ట్గా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్((Allu Arjun) తో త్రివిక్రమ్ ఓ మూవీ ప్లాన్ చేసిన విషయం తెలిసిందే. ఈ మూవీని త్రివిక్రమ్ ఒక ప్రయోగాత్మకమైనా పీరియాడికల్ డ్రామా జోనర్లో  ఫాంటసీ మూవీగా తెరకెక్కిస్తారని సమాచారం. ఇప్పటి వరకి త్రివిక్రమ్ మూవీస్లో డైలాగ్స్ లోనే ఎక్కువ మీనింగ్స్ తెలుసుకున్నారు ఆడియన్స్.

ఇక అల్లు అర్జున్తో తీయబోయే మూవీతో.. స్టోరీ గురుంచే డిస్కస్ చేసేలా..నెక్స్ట్ లెవెల్ ప్లానింగ్తో ఉన్నట్లు తెలుస్తోంది. త్రివిక్రమ్ పెన్ను పవర్ టాలీవుడ్కి మాత్రమే తెలుసు తన స్టామినా ఏంటనేది. ఇక ఈ మూవీతో పాన్ ఇండియా స్థాయిలో తన పెన్ను పవర్ను చూపించడానికి రెడీ అయ్యాడు. దీంతో ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్..త్రివిక్రమ్ కాంబోలో రానున్న ఈ నాలుగో సినిమాపై అఫీషియల్ అనౌన్స్మెంట్ రీసెంట్ గానే వచ్చేసింది. గీత ఆర్ట్స్(Geetha arts), హారికా హాసిని క్రియేషన్స్(Haarika hassine creations) సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తుంది. 

ఇక త్రివిక్రమ్ ప్రస్తుతం, మహేష్ బాబు(Mahesh babu)తో గుంటూరు కారం(Guntur kaaram), అల్లు అర్జున్ పుష్ప ది రూల్(Pushpa The Rule) సినిమాలతో బిజీగా ఉన్నారు. ఈ రెండు సినిమాలు కంప్లీట్ అవగానే అల్లు అర్జున్, త్రివిక్రమ్ మూవీ సెట్స్ పైకి వెళ్లనుందని తెలుస్తోంది. మరి పాన్ ఇండియా లెవల్లో, భారీ బడ్జెట్ తో రానున్న ఈ సినిమా.. ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి వండర్స్ క్రియేట్ చేయనుందో చూడాలి మరి.