AlluArjun: ట్రెండ్ అవుతున్న అల్లు అర్జున్ హాలీవుడ్‌ ట్రిప్.. ఫ్యామిలీతో కలిసి వెకేషన్ ఎంజాయ్

AlluArjun: ట్రెండ్ అవుతున్న అల్లు అర్జున్ హాలీవుడ్‌ ట్రిప్.. ఫ్యామిలీతో కలిసి వెకేషన్ ఎంజాయ్

హీరో అల్లు అర్జున్ ప్రస్తుతం తన ఫ్యామిలీతో వెకేషన్లో ఉన్నాడు. కుటుంబ సమేతంగా అమెరికాలోని యూనివర్సల్ స్టూడియోస్ హాలీవుడ్‌లో సరదాగా గడుపుతున్నాడు. లేటెస్ట్గా (జులై17న) అల్లు అర్జున్ తన ఇంస్టాగ్రామ్ నుండి వెకేషన్ ఫోటోలు పోస్ట్ చేశాడు.

ఇందులో అల్లు అర్జున్, అతని భార్య అల్లు స్నేహా రెడ్డి, పిల్లలు అల్లు అయాన్, అల్లు అర్హలతో కలిసి ట్రిప్ చాలా ఎంజాయ్ చేసినట్లు కనిపిస్తోంది. అలాగే, అల్లు అర్జున్ తన పిల్లలతో సెలవులను ఆస్వాదిస్తున్నట్లు, రిలాక్స్డ్ మూడ్ మరియు బ్యూటిఫుల్ లొకేషన్స్లో ఉన్న ఫోటోలను స్నేహ రెడ్డి సైతం తన ఇన్‌స్టాలో షేర్ చేసింది.

ఫ్యామిలీ మొత్తం బ్లాక్ డ్రెస్సులో కనిపించి నెటిజన్లని అట్రాక్ట్ చేస్తున్నారు. ఇపుడీ ఈ ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ క్రమంలో ఓ ఫొటోలో అల్లు అర్జున్ తన కూతురు అర్హను తన చేతుల్లో పట్టుకుని ఆప్యాయంగా చూడటం కనిపిస్తుంది. ఆ ఫోటోకి అల్లు ఫ్యాన్స్ హార్ట్, హార్ట్-ఐ ఎమోజీలతో కామెంట్లు పెడుతున్నారు.

అలాగే ఈ ఫ్రెమ్లో అల్లు అర్జున్ కొత్త లుక్ ఆకట్టుకుంటోంది. ఐదేళ్ల పాటు పుష్ప కోసం భారీ గడ్డం, లాంగ్ హెయిర్ స్టైల్ మెయింటేన్ చేసిన బన్నీ.. షార్ట్ హెయిర్ స్టైల్, గడ్డంతో  ఫ్రెష్గా ఉన్నాడు. ఈ కొత్త స్టైల్ అల్లు అర్జున్కి బాగా సూటైందని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

ప్రస్తుతం అల్లు అర్జున్ బ్లాక్‌బస్టర్ చిత్రాల దర్శకుడు అట్లీతో కలిసి సరికొత్త భారీ సినిమాకు శ్రీకారం చుట్టారు.  AA22 x A6 (వర్కింగ్ టైటిల్‌) చిత్రానికి సంబంధించిన షూటింగ్ వర్క్ కూడా ప్రారంభమైనట్లు తెలుస్తోంది. పుష్ప2 తర్వాత అల్లు అర్జున్ కెరీర్ లో అత్యంత గొప్ప చిత్రంగా ఉండబోతుందని టాక్ వినిపిస్తుంది. అటు అభిమానుల్లో భారీగానే అంచనాలు ఉన్నాయి.

ఈ మూవీలో అల్లు అర్జున్ ఒకే కుటుంబానికి చెందిన నాలుగు తరాల పాత్రల్లో కనిపించనున్నారని తెలుస్తోంది. అంటే, అతను ఒక తాతగా, తండ్రిగా, మరియు ఇద్దరు కొడుకులుగా కనిపించి ప్రేక్షకులను ఆశ్చర్యపరచనున్నాడు. "ఇది అల్లు అర్జున్ కెరీర్‌లోనే ఒక మైలురాయి. ఇలాంటి క్లిష్టమైన సినిమాటిక్ సవాల్‌ను ఎంచుకోవడం  మాములు విషయం కాదని అని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.