
మోటర్ వెహికల్ యాక్ట్ ను పోలీసులు స్ట్రిక్ట్ గా అమలు చేస్తున్నారు. వాహనాలకు అవనసర స్టిక్కర్లు, అద్దాలకు బ్లాక్ కవర్ లను తొలగిస్తున్నారు. సినీ నటుడు అల్లు అర్జున్ కారుకు జరిమానా విధించారు జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీసులు. శనివారం జూబ్లీహిల్స్ రోడ్ నంబరు 36 లోని నీరూస్ చౌరస్తాలో వాహనాల తనిఖీలు చేస్తున్న పోలీసులు అటుగా వెళ్తున్నఅల్లు అర్జున్ కారును ఆపారు. ఆయన కారు అద్దాలకు ఉన్న బ్లాక్ ఫిల్మ్‌లను తొలగించారు. అంతే కాదు నిబంధనలకు విరుద్థంగా బ్లాక్ ఫిల్మ్ వేసుకున్నందుకు రూ. 700 ఫైన్ కూడా వేశారు. ఆర్టీఏ అప్రూవ్ చేసిన గ్లాసెస్ ను మాత్రమే వాడాలని సూచించారు పోలీసులు.
అంతే కాదు అదే దారిలో వచ్చిన మరో హీరో కల్యాణ్ రామ్ కారును కూడా పోలీసులు ఆపారు. ఈ కారుకు కూడా బ్లాక్ ఫీల్మ్ ఉండటంతో దాన్నితీసి.. ఫైన్ కూడా వేశారు. ఒక్క బ్లాక్ ఫిల్మ్ విషయంలోనే కాదు.. వాహనాల నంబర్ ప్లేట్లపై వంకర టింకరగా అంకెలు రాయడం.. లాంటి ట్రాఫిక్ రూల్స్ కు విరుద్థంగా వ్యవహరించేవారిని వదిలిపెట్టేది లేదు అని హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ జాయింట్ సీపీ ఏవీ రంగనాథ్ తెలిపారు. నిబంధనలను పాటించని వారికి జరిమానాలు విధించాలని ఆదేశాలు జారీ చేశారు.