Allu Arjun: ఇప్పుడే అందరూ నన్ను గుర్తిస్తున్నారు.. ‘వేవ్స్‌’లో అల్లు అర్జున్‌ ఇంపాక్ట్ స్పీచ్

Allu Arjun: ఇప్పుడే అందరూ నన్ను గుర్తిస్తున్నారు.. ‘వేవ్స్‌’లో అల్లు అర్జున్‌ ఇంపాక్ట్ స్పీచ్

ముంబై వేదికగా ప్రతిష్ఠాత్మక వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్‌‌‌‌టైన్‌‌మెంట్ సమిట్ (వేవ్స్) గురువారం మే1న గ్రాండ్‌‌గా ప్రారంభమైంది. ఈ ‘వేవ్స్‌’సమిట్లో భాగంగా జరిగిన 'టాలెంట్ బియాండ్ బోర్డర్స్' సెషన్‌లో అల్లు అర్జున్ ప్రసంగించారు.

ఈ సందర్భంగా బన్నీ తన సినీ విషయాలతో పాటు, ఇండియన్ సినిమా పరిస్థితులపై ఇంపాక్ట్ స్పీచ్ ఇచ్చారు. ప్రస్తుతం అల్లు అర్జున్ మాట్లాడిన స్పీచ్ను బన్నీ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు. 

అల్లు అర్జున్ మాట్లాడుతూ.. ‘‘భారతీయ సినీ పరిశ్రమ మరింత బలపడుతోందని, త్వరలోనే ప్రపంచ బాక్సాఫీస్‌పై పెద్ద ప్రభావాన్ని చూపుతుందని అల్లు అర్జున్ అన్నారు. మనకు చాలా పెద్ద సినీ పరిశ్రమ ఉంది. మనం దశాబ్దాలుగా ఇక్కడే ఉంటున్నాం. కానీ ప్రపంచ బాక్సాఫీస్‌పై ఇంకా గణనీయమైన ప్రభావాన్ని చూపలేకపోయామని, అందుకు సమయం ఆసన్నమైందని అల్లు అర్జున్ తెలిపారు. రాబోయే రోజుల్లో ఇండియన్ సినీ పరిశ్రమ ప్రపంచవ్యాప్తంగా తనదైన ముద్ర వేస్తుందని’’ అల్లు అర్జున్ విశ్వాసం వ్యక్తం చేశారు.

ఇక తన సినీ జీవితాన్ని గుర్తుచేసుకుంటూ.. ‘ఈ ప్రయాణంలో ఎన్నో సవాళ్లు అధిగమించానని, సినిమానే నా ప్రపంచమని అన్నారు. సినిమా తప్ప మరో ఆలోచన లేదని తెలిపారు. ఎంతోమంది నాపై చూపించిన అభిమానం వల్లే ఈ స్థాయికి చేరుకున్నా.. ఇంకా సాధించాల్సింది చాలా ఉందని బన్నీ వెల్లడించారు. ఇప్పటికే సౌత్, నార్త్లో తనకంటూ ఓ గుర్తింపు ఉందని చెప్పారు. ఇక పుష్ప సినిమా తనను జాతీయస్థాయి ప్రేక్షకులకు పరిచయం చేసిందని’ బన్నీ గుర్తుచేసుకున్నారు.

నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి చెబుతూ.. "డైరెక్టర్ అట్లీ చెప్పిన ఐడియా తనను ఎంతగానో ఇంప్రెస్ చేసిందని, ఇండియా సినిమాలో విజువల్‌ ఎఫెక్ట్స్‌లో ప్రేక్షకులకు కొత్త అనుభూతి పంచుతుందని.. ఇది అంతర్జాతీయ స్థాయిలో ఉండే మూవీ" అని అల్లు అర్జున్ అన్నాడు.

ఇకపోతే అల్లు అర్జున్ చివరగా కనిపించిన మూవీ పుష్ప 2. సుకుమార్ తెరకెక్కించిన ఈ మూవీ వరల్డ్ వైడ్ గా రూ.1850 కోట్లు వసూలు చేసి సంచలనం సృష్టించింది. ఇపుడు రాబోయే అట్లీ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.