Allu Arjun Toothpaste Painting: గ్రేట్ అభిమాని..టూత్‌పేస్ట్‌తో అల్లు అర్జున్ పెయింటింగ్..వీడియో చూస్తే శభాష్ అంటారు

Allu Arjun Toothpaste Painting: గ్రేట్ అభిమాని..టూత్‌పేస్ట్‌తో అల్లు అర్జున్ పెయింటింగ్..వీడియో చూస్తే శభాష్ అంటారు

అభిమానులు..ఈ పదం వెనుక ఎంతో నిరీక్షణ ఉంటుంది. అదేంటీ అనుకుంటున్నారా? అవునండీ..ప్రతి హీరో అభిమాని తన ఫేవరేట్ హీరోని ఎలాగైనా కలవాలని అనుకుంటాడు. అలాగే తన అభిమానాన్ని మనసారా చాటాలనుకుంటున్నాడు.కానీ,దీన్ని వెనుక ఎంతో నిరీక్షణ ఉంటుంది.. ఎన్నో ప్రయత్నాలుంటాయి.

ఇపుడు అలాంటి ఒక అభిమాని తన అభిమాన హీరో కోసం ఏం చేశాడో చూస్తే..శభాష్ అంటారు.వివరాల్లోకి వెళితే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun)అభిమాని ఒకరు ఏకంగా టూత్‌పేస్ట్‌తో 'పుష్ప'లోని అల్లు అర్జున్ చిత్రపటాన్ని సృష్టించాడు.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ఈ వీడియో ఏకంగా 6 మిలియన్లకి పైగా వ్యూస్ తో దూసుకెళ్తోంది.మరి ఇంతటి టాలెంట్ ఎవరికుందో తెలుసుకోవాలని ప్రతిఒక్కరికీ ఉంటుంది కదా..అతనెవరో చూద్దాం. 

గతంలో అయోధ్యలో రామజన్మభూమి ప్రారంభోత్సవం సందర్భంగా..శ్రీరాముడు మరియు సీతాదేవిని అద్భుతంగా చూపించి తన కళాకృతిని చాటి వైరల్ అయిన షింటు మౌర్య(Shintu Mourya)..ఇప్పుడు అల్లు అర్జున్‌ను పెయింటింగ్ చేస్తూ కనిపించాడు. 

రీసెంట్గా షింటు మౌర్య తన ఇన్‌స్టాగ్రామ్ రీల్ లో..అతను తన కళాత్మక నైపుణ్యాలను బయటకు తీసుకురావడానికి పోస్ట్స్ చేస్తున్నారు. ఇపుడు ఏకంగా వాటర్ కలర్స్,ఆయిల్ క్రేయాన్స్ వంటి కెమికల్స్ ఉపయోగించకుండా కేవలం టూత్‌పేస్ట్ వంటి సాంప్రదాయేతర పదార్థాలతో అల్లు అర్జున్ పెయింటింగ్ గీయడంపై నెటిజన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియోని బన్నీ ఫ్యాన్స్ తెగ షేర్ చేస్తున్నారు.ఆలస్యం ఎందుకు మీరు కూడా చూసేయండి.