గోదావరి నదిలో పుష్ప 2 లారీల ఛేజింగ్ సీన్స్ : ఒరిజినాలిటీ చూసి ఫ్యాన్స్ షాక్

గోదావరి నదిలో పుష్ప 2 లారీల ఛేజింగ్ సీన్స్ : ఒరిజినాలిటీ చూసి ఫ్యాన్స్ షాక్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) నటిస్తున్న లేటెస్ట్ మూవీ పుష్ప ది రూల్(Pushpa the rule). ఈ సినిమా కోసం ఐకాన్ స్టార్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. మొదటి పార్ట్ భారీ విజయం సాధించిన నేపథ్యంలో.. పుష్ప పార్ట్ 2 పై అంచనాలు నెక్స్ట్ లెవల్లో ఉన్నాయి. ఇక తాజాగా సినిమా నుండి రిలీజైన బన్నీ ఫస్ట్ లుక్ అండ్ గ్లింప్స్ కు ఆడియన్స్ నుండి క్రేజీ రెస్పాన్స్ వచ్చింది.

దీంతో ఈ సినిమా నుండి వినిపిస్తున్న చిన్న న్యూస్ అయినా క్షణాల్లో వైరల్ గా మారుతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పశ్చిమగోదావరి జిల్లా గోపాలపురం మండలం గుడ్డుగూడెంలో జరుగుతోంది. ఓపెన్ ప్లేస్ లో పుష్ప సినిమా షూటింగ్ జరుగుతుండటంతో.. అది చూసేందుకు జనాలు గుమిగూడారు. అందులో ఒకరు ఆ షూటింగ్ వీడియోను ఫోన్ లో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. దాంతో ఆ వీడియో కాస్త క్షణాల్లో వైరల్ గా మారింది.

టాలీవుడ్ క్రియేటీవ్ డైరెక్టర్ సుకుమార్(Sukumar) తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో నేషనల్ క్రష్ రష్మిక మందనా(Rashmika Mandana) హీరోయిన్ గా నటిస్తోంది. మలయాళ స్టార్ ఫహద్ ఫజిల్(Fahad faasil) విలన్ గా చేస్తున్న ఈ సినిమాకు రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్(Devi sri prasad) సంగీతం అందిస్తున్నాడు. ఇక ఈ సినిమా 2023 చివర్లో గా, 2024 సమ్మర్ లో గానీ ప్రేక్షకుల ముందుకు రానుంది.