
బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించిన పుష్ప పార్ట్ 1 గురించి అందరికీ తెలిసిందే. తాజాగా పుష్ప 2 ది రైజింగ్ షూటింగ్ మొదలైంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ హీరోయిన్ రష్మిక మందన జంటగా నటించిన పుష్ప మూవీకి ఎంత ఆదరణ లభించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పాన్ ఇండియా రేంజ్ లో వివిధ భాషల్లో రిలీజైన ఈ మూవీతో అల్లు అర్జున్ పాపులారిటీ మరింత పెరిగిపోయింది. డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ అన్ని తరాల వారినీ అలరించి, మెప్పించిందనడంలో ఏ మాత్రం సందేహం లేదు. అయితే పుష్ప 1 రిలీజైనప్పటి నుంచీ ప్రేక్షకులకు పార్ట్ 2 పైన మరింత ఆసక్తి నెలకొంది.
పుష్ప ది రైజింగ్ పేరుతో పార్ట్ 1 తెరకెక్కగా.. ఇప్పుడు పుష్ప 2 ది రూల్ అంటూ బన్నీ మరోసారి ఫ్యాన్స్ ను ఉర్రూతలూగించనున్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పలుమార్లు వాయిదా పడగా... తాజాగా ఈ మూవీకి సంబంధించి పూజా కార్యక్రమాలను చిత్ర బృందం పూర్తి చేసింది. దాంతో పాటు షూటింగ్ ను కూడా మొదలు పెట్టినట్టు ప్రకటించింది. పుష్ప 1 భారీ స్థాయిలో హిట్ కావడంతో.. ఇప్పుడు పుష్ప 2 పైనా అంతకు మించి అంచనాలు నెలకొంటున్నాయి.