థాంక్స్ కళ్యాణ్ బాబాయ్ అంటూ అల్లు అర్జున్ ఎమోషనల్.. మెగా ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ..

థాంక్స్ కళ్యాణ్ బాబాయ్ అంటూ అల్లు అర్జున్ ఎమోషనల్.. మెగా ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ..

 

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప 2: ది రూల్ సినిమా డిసెంబర్ 05న రిలీజ్ కాగా బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది. ఈ సినిమా వరల్డ్ వైడ్ దాదాపుగా 12500 స్క్రీన్స్ లో రిలీజ్ కాగా రిలీజ్ అయిన రెండు రోజుల్లోనే రూ.449 కోట్లు(గ్రాస్) కలెక్ట్ చేసి ఇండస్ట్రీ రికార్డులు క్రియేట్ చేసింది. దీంతో శుక్రవారం పుష్ప 2 చిత్ర యూనిట్ హైదరాబాద్ లో సక్సస్ మీట్ నిర్వహించారు. ఈ సక్సస్ మీట్ కి హీరో అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ తదితరులతో పాటూ సినిమా యూనిట్ హాజరయ్యారు. 

ఈ సందర్భంగా హీరో అల్లు అర్జున్ మాట్లాడుతూ రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులకి, సినిమాటోగ్రఫీ మంత్రులకి థాంక్స్ చెప్పాడు. ఇందులో భాగంగా టికెట్ రేట్ల విషయంలో సానుకూలంగా స్పందించి అనుమతులు ఇస్తూ జీవో జారీ చేసినందుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సినిమాటోగ్రఫీ మంత్రి కోమిటి రెడ్డి వెంకటరెడ్డి తదితరులకు ధన్యవాదాలు తెలిపాడు. ఇక ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ తదితరులకు కృతజ్ఞతలు తెలిపాడు. 

Also Read :- టాక్ షోలో సాయిపల్లవికి రానా కాల్.. టెన్షన్ పడ్డ చైతూ

అయితే ఇందులో అల్లు అర్జున్ మరోసారి కళ్యాణ్ బాబాయ్ థాంక్స్ అని చెప్పగానే అభిమానులు కేకలు, ఈలలతో హంగామా చేశారు. దీంతో మెగా ఫ్యాన్స్ కూడా ఖుషీ అవుతున్నారు. అయితే గత కొన్ని నెలలుగా మెగా కాంపౌండ్ లో వివాదాలు ఉన్నాయని దీంతో అల్లు అర్జున్ కి మెగా హీరోలకి పడటం లేదని అందుకే పుష్ప 2 కి సపోర్ట్ చెయ్యడం లేదని గుసగుసలు వినిపిస్తున్నాయి. సక్సస్ మీట్ లో పవన్ కి బన్నీ థాంక్స్ చెప్పడంతో ఈ రూమర్లకు పులిస్టాప్ పడింది.

ఈ విషయం ఇలా ఉండగా పుష్ప 2 సినిమా తెలుగుతోపాటూ నార్త్ లో కూడా భారిగా కలెక్షన్లు సాధిస్తోంది. కాగా బాలీవుడ్ హీరోల హైయ్యెస్ట్ రికార్డులని సైతం బ్రేక్ చేస్తోంది. కాగా ఇప్పటికే హిందీలో హెయ్యెస్ట్ డే ఓపెనింగ్స్ లో టాప్ లో ఉన్న జవాన్ సినిమా రికార్డులని బ్రేక్ చేసింది.