
అల్లు శిరీష్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘బడ్డీ’. శామ్ ఆంటోన్ దర్శకత్వం వహిస్తున్నాడు. స్టూడియో గ్రీన్ బ్యానర్‌పై కేఈ జ్ఞానవేల్ రాజా, అధన జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. అడ్వెంచరస్ యాక్షన్ ఎంటర్ టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని జులై 26న విడుదల చేయబోతున్నట్టు గతంలో ప్రకటించారు.
అయితే ఇప్పుడు విడుదల వాయిదా పడింది. ఆగస్టు 2న విడుదల చేయనున్నట్టు కొత్త రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేశారు. గాయత్రీ భరద్వాజ్, ప్రిషా రాజేష్ సింగ్ హీరోయిన్స్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో అలీ, అజ్మల్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. హిప్ హాప్ తమిళ సంగీతం అందిస్తున్నాడు.