Allu Sirish: తడిసి ముద్దైన అల్లు శిరీష్ నిశ్చితార్థం ప్లేస్.. 'దేవుడి ప్లాన్ వేరే' అంటూ ఎమోషనల్ పోస్ట్!

Allu Sirish: తడిసి ముద్దైన అల్లు శిరీష్ నిశ్చితార్థం ప్లేస్.. 'దేవుడి ప్లాన్ వేరే' అంటూ ఎమోషనల్ పోస్ట్!

అల్లు వారి ఇంట పెళ్లి సందడి మొదలైంది. టాలీవుడ్ ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ చిన్న కుమారుడు, హీరో అల్లు శిరీష్ బ్యాచిలర్ లైఫ్ కు గుడ్ బై చెప్పనున్నారు. పెళ్లి పీటలు ఎక్కబోతున్నాను. తన తాతయ్య అల్లు రామలింగయ్య జయంతి సందర్భంగా .. తన పెళ్లికి సంబంధించి వార్తను అభిమానులతో పంచుకున్నారు. ఈ శుభవార్త సమయంలో నానామ్మ ఉండి ఉంటే ఎంతో సంతోషించేది అని తెలిపారు. అక్టోబర్ 31న నయనికతో తన మ్యారేజ్ నిశ్చితార్థం జరుగుతోందని  సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. 

ఆ సమయం రానే వచ్చేసింది. ఎంతో ఆశతో తన ఎంగేజ్ మెంట్ ను అక్టోబర్ 31న గ్రాండ్ గా  ఓపెన్ ప్లేస్ లో చేసుకోవాలని తలచారు అల్లు శిరీష్. దానికి తగ్గట్టుగా పనులు కూడా చక్కగా ప్లాన్ చేసుకుని ఏర్పాటు చేసుకున్నారు. కానీ శిరీష్ ఆశలు నీరుకారిపోయాయి.  వరుణదేవుడు కనుకరించలేదు. ఊహించని విధంగా మొంథా తుఫాన్ రూపంలో ఆశలను ఆవిరిచేశాడు. మరో మూడు రోజులు వర్షం కురవకుండా ఉంటే బాగుందేది కదా.. అని ఆవేదన వ్యక్తం చేశారు.

రెండు రోజులుగా కురుస్తున్న వానతో ఎంగేజ్ మెంట్ ప్లేస్ మొత్తం తడిసిపోయింది. ఇప్పుడు సూర్య భగవానుడు కరిణించినా.. అది ఆరే పరిస్థితి కనిపించడంలేదు..  తాను ఒకటి తలిస్తే దైవం వేరొకటి తలచిందన్నట్లు అయ్యింది.  దీంతో డీలాపడ్డ శిరీష్ తన నిశ్చితార్థం జరగాల్సిన ప్లేస్ ఫోటోను ఇన్ స్టగ్రామ్ లో షేర్ చేశారు. కానీ వాతావరణం .. దేవుడు వేరే ప్లాన్ లో ఉన్నారు అంటూ పోస్ట్ చేశారు. 

రేపు (  అక్టోబర్ 31న శిరీష్ నిశ్చతార్థం ఎక్కడ జరగనుందో చూడాలి.  ఈ పెళ్లి అల్లువారి ఇంట జరుగుతున్న చివరి నిశ్చితార్థం. ఇక ఇటీవల అల్లు అరవింద్ ఇంట్లో దీపావళి వేడుక జరిగింది. ఈ వేడుకకు కాబోయే కొత్త కోడలు నయనిక కూడా హాజరైంది. ఆమెతో కలిసి అల్లు ఫ్యామిలీ గ్రూప్ ఫోటో కూడా దిగింది. ఆమె ఫోటోతో ఉన్న ఫిక్స్ ను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.  ఆ వెంటనే జరిగిన తప్పును స్నేహరెడ్డి సరిదిద్దుకున్నారు. నయనిక ఫోటోను క్రాఫ్ చేసి పోస్ట్ చేశారు.