బడిబాటకు 60 శాతం పిల్లలది కాలినడకనే..

బడిబాటకు 60 శాతం పిల్లలది కాలినడకనే..

అబ్బాయిల కంటే అమ్మాయిల శాతమే ఎక్కువ
న్యూఢిల్లీ: దేశంలో ఎక్కువ మంది పిల్లలు స్కూళ్లకు కాలినడకనే వెళ్తున్నారు. నేషనల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ (ఎన్‌‌ఎస్‌‌వో) వెలువరించిన తాజా రిపోర్ట్‌‌లో ఈ విషయం వెల్లడైంది. ఈ సర్వే ప్రకారం దేశంలో 59.7 శాతం విద్యార్థులు పాఠశాలలకు కాలినడకనే వెళ్తున్నారు. వీరిలో అబ్బాయిలు (57.9 శాతం)తో పోల్చితే అమ్మాయిలు (62 శాతం) ఎక్కువగా ఉండటం గమనార్హం. రూరల్, అర్బన్ ఏరియాల్లో చేసిన సర్వేలో కూడా దాదాపుగా ఇలాంటి ఫలితాలే నమోదయ్యాయి. దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో 61.4 శాతం మంది అబ్బాయిలు స్కూళ్లకు కాలినడకన వెళ్తుండగా, 66.5 శాతం మంది అమ్మాయిలు బడులకు నడుస్తూ వెళ్తున్నారు. అదే పట్టణ ప్రాంతాల్లో చూసుకుంటే.. అబ్బాయిలు (57.9 శాతం), అమ్మాయిలు (62 శాతం) కాలినడకన బడులకు వెళ్తున్నారు. కాలినడక తర్వాత పిల్లలు స్కూళ్లకు వెళ్లడానికి ఎక్కువగా పబ్లిక్ ట్రాన్స్‌‌పోర్ట్‌‌ను వినియోగిస్తున్నారు. దేశవ్యాప్తంగా 12.4 శాతం మంది పిల్లలు పబ్లిక్ ట్రాన్స్‌‌పోర్ట్‌‌‌లో స్కూళ్లకు వెళ్తున్నారు.