మరో కీలక ఉగ్రవాదిని హతమార్చిన అమెరికా

మరో కీలక ఉగ్రవాదిని హతమార్చిన అమెరికా

మరో కీలక ఉగ్రవాదిని హతమార్చింది అమెరికా. అరేబియా ద్వీపకల్పంలో (AQAP)  అల్-ఖైదా వ్యవస్థాపకుడు ఖాసిమ్ అల్-రిమిని హతమార్చినట్లు   అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్  ప్రకటించారు. అయితే ఖాసిమ్ ను ఎప్పుడు చంపామనేది చెప్పలేదు. యోమెన్ లో ఉగ్రవాదులపై జరిపిన కాల్పుల్లో ఖాసిమ్ అల్ రిమి మృతి చెందాడని తెలిపింది. ఖాసిమ్ మృతి అల్ ఖైదా కార్యాకలాపాలపై తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు.

ఫ్లోరిడాలోని యుఎస్ నావల్ ఎయిర్ స్టేషన్ పెన్సకోలాలో డిసెంబర్ 6 న జరిగిన కాల్పులు జరిగాయి.  ఇందులో సౌదీ సైనికాధికారి ముగ్గురు అమెరికన్ నావికులు చనిపోయారు. అయితే ఆ కాల్పులకు తామే భాద్యులమని AQAP ఆదివారం ప్రకటించింది. దీనికి ప్రతికారంగానే  AQAP అధ్యక్షుడు ఖాసిమ్ అల్-రిమిని  హతమార్చింది అమెరికా.

see more news

సిద్దిపేట జిల్లాలో కాల్పుల మోత

వెనక నుంచి వచ్చి ముద్దు పెట్టి పారిపోవడమే అతడి పని