గాంధీ పీడియాట్రిక్ సేవలు భేష్ : వీసీ రమేశ్రెడ్డి

గాంధీ పీడియాట్రిక్ సేవలు భేష్ :  వీసీ రమేశ్రెడ్డి
  • కాళోజీ హెల్త్ వర్శిటీ వీసీ రమేశ్​రెడ్డి

పద్మారావునగర్, వెలుగు : గాంధీ దవాఖాన పీడియాట్రిక్ సర్జరీ విభాగంలో వైద్యుల సేవలు అభినందనీయమని కాళోజీ నారాయణరావు హెల్త్ వర్సిటీ  వీసీ ​డాక్టర్ కె.రమేశ్ రెడ్డి అన్నారు. జాతీయ పీడియాట్రిక్ సర్జన్స్ డే సందర్భంగా సోమవారం గాంధీలో  సెలబ్రేషన్స్​నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు తల్లిదండ్రులు వారి పిల్లలకు అందించిన వైద్య సేవలను గుర్తు చేసుకున్నారు. 

ప్రైవేట్ ఆస్పత్రుల్లో సాధ్యం కాని అనేక కేసులను గాంధీలో విజయవంతంగా నిర్వహించిన వైద్యులకు కృతజ్ఞతలు తెలిపారు. సూపరింటెండెంట్ డాక్టర్ ఎన్.వాణి, పీడియాట్రిక్ సర్జరీ విభాగం హెచ్‌‌వోడీ ప్రొఫెసర్ కె.నాగార్జున, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.