- మంత్రి సీతక్కకు పీఆర్, ఆర్డీ ఉద్యోగుల వినతి
హైదరాబాద్, వెలుగు: పంచాయతీరాజ్, గ్రామీణ ఉపాధి కమిషనర్ కార్యాలయంలో అదనంగా కొత్త పోస్టులు మంజూరు చేయాలని మంత్రి సీతక్కను టీజేఎస్ ప్రెసిడెంట్, ప్రొఫెసర్ కోదండరాం కోరారు. ఈ మేరకు సోమవారం తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ నేతలతో కలిసి ఆమెకు వినతిపత్రం అందించారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ హైదరాబాద్ ప్రెసిడెంట్ కిషన్ సింగ్, జనరల్ సెక్రటరీ ఉదయశ్రీ, బాలాజీ క్రాంతి కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
